మేష రాశి (Aries)
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభదినం. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది. మీ సన్నిహితులు, సహచరులు ఈ రోజు మీకు సహాయం చేస్తారు. మీరు దాని వలన ప్రయోజనం కూడా పొందుతారు. ఉన్నత విద్య కోసం అనువైన సమయం. మొత్తం మీద ఈ రోజు మీకు అన్ని విధాలుగా బాగుంటుంది.
వృషభ రాశి (Taurus)
ఈ రోజు ఈ రాశి స్త్రీ, పురుషులు సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ఆచితూచి వ్యవహరించండి. ఏ విషయంలో అయినా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఒక అభిప్రాయానికి రండి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం గడపండి మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది.
మిథున రాశి (Gemini)
ఈ రోజు మీరు అనుకున్న పని పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వామి నుంచి మీకు అన్ని రకాలుగా పూర్తి మద్దతు లభిస్తుంది. ఇంట్లో వివాహ వేడుకను నిర్వహించే అవకాశముంది. దీని కారణంగా ఇంట్లో చాలా హడావుడి ఉంటుంది. ఈ రోజు మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కానీ స్నేహితుడిని కానీ కలుసుకునే వీలుంది.
కర్కాటక రాశి (Cancer)
ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీకు ఈ రోజు ఆశాజనకంగా ఉండబోతోంది. మీ మాటల్తో మీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తారు. భౌతిక అలంకరణకు, సుఖాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మీ పిల్లలు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రోజు ఈ రాశి పురుషులుకు స్త్రీల నుంచి మద్దతు లభిస్తుంది.
సింహ రాశి (Leo)
ఈ రాశి వారు ఈ రోజు ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనాలను పొందవచ్చు. ఏ రంగానికి చెందినవారు అయినా సకాలంలో మీ పనులు పూర్తి చేసినట్టయితే, మంచి అవకాశాలు, ప్రశంసలు అందుకుంటారు. ఆయా రంగాల్లో భవిష్యత్తులో మీరు అపారమైన ప్రయోజనాలను పొందుతారు . జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి. తన కోసం కొంత సమయం కేటాయించండి.
కన్యారాశి (Virgo)
ఈ రోజు మీరు కొన్ని కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆ ఆలోచనలు ఇతరులను కూడా ప్రభావితం చేస్తాయి. కొంతమంది సామాజిక వ్యక్తులు మీతో చేరాలనుకుంటున్నారు. మీరు కూడా కొత్త సంస్థలో భాగం అవుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో స్థాయి పెరుగుతుంది, మీ మాట పై అందరికీ గౌరవం పెరుగుతుంది. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
తులా రాశి (Libra)
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు మీరు వివిధ రంగాల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కోరుకున్నవి ఈ రోజు నెరవేరవు. అందువల్ల మీరు నిరుత్సాహ పడకండి. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రాశి వారికి ఈ రోజు శుభదినం. మీరు ఈ రోజు చేసే పనులు పెద్దగా ఫలితాలు చూపించవు, కానీ మీకు ఏం నష్టం జరగదు. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ఎవరితోనైనా గొడవ పడవచ్చు, నివారించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అప్రమత్తంగా ఉండండి.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈరోజు మీకు అత్యంత శుభదినం. ఉద్యోగస్తులకు అత్యవసర సమావేశాలు ఉండే అవకాశముంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు మీ పనుల మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. సమావేశంలో ప్రజల్ని ఆకట్టుకుంటారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. మీ బంధం మరింత బలపడుతుంది.
మకర రాశి (Capricorn)
ఈరోజు ఈ రాశి వారికి కుటుంబంలోనూ, సమాజంలోనూ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులనుంచి ప్రశంసలు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు ఈ రోజు ప్రజల మద్దతు సంపూర్ణగా పొందుతారు. మీరు మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ఏకాంతంలో గడుపుతారు.
కుంభ రాశి (Aquarius)
ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఇంకా మంచి ఆఫర్స్ ని అందుకుంటారు. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారస్తులు నూతన ప్రణాళికలు చేయటానికి అనువైన సమయం.
మీన రాశి ( Pisces)
ఈ రాశి వారికి ఈరోజు అత్యంత శుభదినం. కమ్యూనికేషన్ సర్వీస్, ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన వ్యక్తులకు ఈరోజు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు విదేశీ కంపెనీ నుంచి జాబ్ ఆఫర్స్ పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. ప్రమోషన్స్ లభించే అవకాశముంది. వ్యాపారస్తులకు ఆర్థిక వృద్ధి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.