మేష రాశి (Aries)
ఈ రోజు ఈ రాశి స్త్రీ, పురుషులకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఆర్ధిక విషయాలు మెరుగుపడతాయి. మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి . మీకు ఈ రోజు సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ఈరోజు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఉంది. కుటుంబ విషయాలను, మీ పర్సనల్ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
వృషభ రాశి (Taurus)
ఈ రాశి వారు ఈరోజు బహుమతులు పొందుతారు. సమాజంలో మీకు ఈ రోజు గౌరవం పెరుగుతుంది. తల్లి వైపు బంధువుల వలన లేని పోని సమస్యలు వచ్చే అవకాశముంది. సోదరుల వల్ల, ఉన్నతాధికారుల వల్ల ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు మంచి సమయమిది. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి.
మిథున రాశి (Gemini)
ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పోటీ రంగంలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బహుమతులు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీకు మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు మీ భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోండి. అవి నెరవేరుతాయి.
కర్కాటక రాశి (Cancer)
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభకరం. వ్యాపారస్తులకు ఆర్ధిక విషయాలలో పురోగతి ఉంటుంది. నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం. విదేశాలకు వెళ్లే వారికి ప్రయాణం ఆహ్లాదకరంగానూ, ప్రోత్సాహకరంగానూ ఉంటుంది. ఈ రోజు మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
సింహ రాశి (Leo)
ఈ రోజు ఈ రాశి వారికి అత్యంత శుభదినం. ఈరోజు ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. వృత్తి పరంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. మీలో ఉన్న సృజనాత్మకత ఉన్నతస్థితికి చేరుకుంటుంది. ఈ రోజు మీరు కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఒత్తిడి ఉంటుంది.
కన్యారాశి (Virgo)
ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులు ఈ రోజు పూర్తి అవుతాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేయటం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు మీ తెలివితేటలతో ఇంటా బయట విజయం సాధిస్తారు.
తులా రాశి (Libra)
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ, సామాజిక సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. ఈరోజు మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఫలితంగా ఎదుటివారి మాటలు, ప్రవర్తన మీ మనసును గాయపరచవచ్చు. బహుమతులు పొందుతారు. గౌరవం పెరుగుతుంది.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఫలించి.ఆర్ధిక సమస్యలు పరిష్కార మవుతాయి. బహుమతులు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. అనవసర హడావుడి ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు, మీరు చాలా పురోగతిని సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈరోజు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలు ఈ రోజు ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబ, సామాజిక సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. వివాహితులు వైవాహిక జీవితంలో ఆనందాన్ని, మాధుర్యాన్ని అనుభవిస్తారు.
మకర రాశి (Capricorn)
ఈ రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేనందున మాటల్లో సంయమనం పాటించండి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పోటీలలో, పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు మహిళా అధికారి సహకారం ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. అప్రమత్తంగా ఉండండి. బహుమతులు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నత స్థాయి అధికారుల అసంతృప్తిని భరించవలసి వస్తుంది.
కుంభ రాశి (Aquarius)
ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లలు చదువుల గూర్చి ఆందోళన చెందుతారు. అనవసర గందరగోళాలు ఎర్పడుతాయి. ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రేమికులు అపార్థాలు దరిచేరనివ్వకండి. సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించుకోండి. మొత్తం మీద ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది.
మీన రాశి ( Pisces)
ఈ రోజు మీకు శుభ దినం. విద్యార్థులకు అనుకూలమైన సమయం. విద్యా రంగంలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు మహిళా అధికారి సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహా స్వీకరించండి. అది మీకే మంచిది. జీవిత భాగస్వామితో కొంత సమయం గడపండి.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.