మేష రాశి (Aries)
ఈ రోజు మీకు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని శుభ సంఘటనల కారణంగా అందరూ సంతోషంగా ఉంటారు. ప్రేమికులు అన్యోన్యంగా గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి ఏకాంతంలో గడుపుతారు. ఇద్దరి మధ్య దూరం కూడా తగ్గుతుంది. ఈ రోజు మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. చిన్న చిన్న విషయాలకు అసహనానికి గురి కాకండి. ఉద్యోగస్తులు మీకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. అనవసరమైన ఖర్చులకు చెక్ పెట్టండి, లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభ రాశి (Taurus)
ఈ రోజు మీకు అత్యంత శుభదినం. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. అధికారులు మీ సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవటం వలన ఆఫీస్ లో మీ గౌరవం పెరుగుతుంది. మీ మాటల్లో సంయమనం పాటించండి. లేదా వివాదాల్లో చిక్కుకుంటారు. మీ పిల్లల కెరీర్‌కు, చదువుకు సంబంధించిన సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీకు కుటుంబంతో ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. కాళ్ల నొప్పులు , వెన్నునొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.
మిథున రాశి (Gemini)
మీరు మీ తల్లి కోరికను నెరవేరుస్తారు. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఎక్కువ ఆదాయ వనరులు పొందడం వలన మీరు ఈరోజు సంతోషంగా ఉంటారు. ఈ రోజు కొన్ని అప్పులు తీరి రిలాక్స్‌గా ఉంటారు. ఉద్యోగస్తులకు ఈ రోజు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. మీరు మీ భాగస్వామితో కొంత సమయం గడపండి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు కొన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతారు.
కర్కాటక రాశి (Cancer)
ఈరోజు మీరు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తారు, అందులో మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు, మీ వాహనాల రిపేర్ల వల్ల మీ ఖర్చులు పెరగవచ్చు. ఈ రోజు మీరు మీ పిల్లలతో ఏదో ఒక విషయంలో గొడవపడతారు. దీని కారణంగా ఈ రోజు మీపై ఒత్తిడి ఉంటుంది. తీర్థయాత్రకు వెళ్లే అవకాశం లభిస్తే, తప్పకుండా వెళ్లండి. ఆర్థిక పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. భవిష్యత్తులో సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. కుటుంబంలోని వ్యక్తులు మీ మాటలకు పూర్తి గౌరవం ఇస్తారు.
సింహ రాశి (Leo)
ఈ రోజు మీకు సోదరులు, సోదరీమణుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ వ్యక్తిత్వంతో అందర్నీ ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మీరు మీ బంధువుల నుంచి బహుమతిని అందుకోవచ్చు, మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుంది. ఈ కారణంగా మీరు ఇబ్బంది పడతారు. ఖర్చులు కూడా అధికమవుతాయి. సానుకూల ఆలోచనలతో ముందుకు కొనసాగండి.
కన్యారాశి (Virgo)
ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. షేర్ మార్కెట్ లో ఇంతకు ముందు చేసిన ఇన్వెస్ట్ మెంట్స్ వలన మంచి రాబడిని పొందుతారు. మీ ఆలోచనలో వచ్చిన మార్పు వలన మీరు మీ పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారు సన్నిహితుల సహాయంతో విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. విద్యార్థుల ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది.
తులా రాశి (Libra)
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మానసిక ఆందోళన ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు ఈ రోజు పూర్తవుతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి, వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపండి, ప్రమాదం పొంచి ఉంది. చట్టపరమైన విషయాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. లేకపోతే ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించవచ్చు.
వృశ్చిక రాశి (Scorpio)
ఆర్థిక పరంగా ఈ రోజు మీకు మంచి రోజు. ఎప్పటి నుంచో వసూలు కానీ బాకీలు ఈ రోజు తిరిగి పొందుతారు. మీ బంధువుల నుంచి కొంత సమాచారాన్ని వింటారు, విద్యార్థులు కష్టపడితే విజయం సాధిస్తారు. కనుక చదువుపై పూర్తి దృష్టిని కొనసాగించాలి. వ్యాపార రంగంలో ఉన్న వారికి భాగస్వామి వ్యాపారం కలిసి రాదు. ఈ రోజు మీ పిల్లలకి సంబంధించిన శుభవార్తలు వింటారు.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రోజు మీరు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఈ రోజు సహోద్యోగుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ కోరిక నెరవేరుతుంది. అపరిచితులను గుడ్డిగా నమ్మటం మానేయండి. మీ జీవిత భాగస్వామి మద్దతు, సాంగత్యాన్ని సమృద్ధిగా పొందుతారు.
మకర రాశి (Capricorn)
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు. సోమరితనం కారణంగా మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఈ రోజు వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేనందువల్ల కొత్త ఒప్పందాలు చేయొద్దు. మీరు తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మీరే పశ్చాత్తాపపడతారు. ఆగిపోయిన పనుల కోసం మీ సన్నిహితుల సహాయం తీసుకోవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా విషయంపై చర్చ జరుగుతుంటే, మీరు మీ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పండి.
కుంభ రాశి (Aquarius)
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆకస్మిక ప్రయోజనాలు పొందుతారు. మీరు సంతోషంగా ఉంటారు. మీ పనులకు అంతరాయం కలిగి ఆగిపోతాయి, శ్రద్ధ పెట్టి వాటిని పూర్తి చేయండి. మిమ్మల్ని కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. అప్రమత్తంగా ఉండండి. మీరు బాగా ఆలోచించి ప్రణాళికలు వేసుకోండి అవి తప్పకుండా నెరవేరుతాయి. మీకు ఈ రోజు ఆర్థిక వృద్ధి ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి చూపిస్తారు.
మీన రాశి (Pisces)
ఈ రోజు మీకు అత్యంత శుభదినం. వ్యాపార రంగంలో ఉన్నవారు ప్రయాణాలు చేసే అవకాశముంది. ప్రయాణంలో మీరు ప్రయోజనం పొందుతారు. ఈ రోజు మీరు ఆధ్యాత్మిక పనులలో చురుకుగా పాల్గొంటారు. మీ సంపాదనలో కొంత భాగాన్ని దాన, ధర్మాలకు ఖర్చు చేస్తారు. కష్టపడి పని చేసిన వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఈ రోజు మీరు వివాదాలకు, వాగ్వాదాలకు దూరంగా ఉండండి. మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చి వారిని ఆనందానికి గురి చేస్తారు.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.