మేష రాశి
విద్యారంగంలో మీరు చేస్తున్న కృషికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. సంబంధిత అధికారుల నుంచి సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల గురించి ప్రియుడితో వాగ్వాదానికి దిగే అవకాశముంది. విదేశాలకు వెళ్లే ఛాన్స్ మిస్ చేసుకోకండి. జీవిత భాగస్వామి మీ కారణంగా కలత చెందుతారు.
వృషభ రాశి
ఈ రాశి మహిళా అధికారులకు ఈ రోజు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. మాటల్లో సంయమనం పాటించండి. ఒక వ్యక్తి కారణంగా మానసిక ఒత్తిడికి గురి అవుతారు. వివాహం కుదిరిన వ్యక్తులకు పెళ్లి తేదీ ఆలస్యం అయ్యే అవకాశముంది. ఈ రోజు రొమాంటిక్ గా ముగుస్తుంది. భాగస్వామితో సంబంధాన్ని పెంపొందించుకోవడానికి కుటుంబ మద్దతు లభించదు.
మిథున రాశి
ఈ రాశి వారికి ఎప్పటి నుంచో కొనసాగుతున్న సమస్య పరిష్కారమవుతుంది. సంబంధాల్లో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనంద దాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు ప్రతిష్ఠాత్మకమైన వ్యాపారంలోకి ప్రవేశించవచ్చు. ఇది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
కర్కాటక రాశి
ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసర ప్రయాణాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదో అయోమయంలో ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. ఈ రోజు ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. అధికారులతో మీరు ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి.
సింహ రాశి
ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది కానీ అత్తమామల నుంచి కొన్ని అనవసర చిక్కులు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. సింహ రాశి వారు ఈ రోజు ఇతరుల సహకారం పొందడంలో విజయం సాధిస్తారు. మీ స్వభావంలో తక్కువ ఆచరణాత్మకత, ఎక్కువ భావోద్వేగం ఉంటుంది.
కన్యా రాశి
మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలున్నా తెలివితేటలతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ రోజు మీరు అత్యంత ఆనందంగా గడుపుతారు. కెరియర్ లో మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. అధికారుల మద్దతుతో ఆర్థిక పరిస్థితి కూడా గణనీయంగా మెరుగుపడుతుంది.
తులా రాశి
ఈ రోజు ఈ రాశి వారు సంతానానికి సంబంధించిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. విద్యారంగంలో చేసిన కృషి ఫలిస్తుంది. వ్యాపార ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ఈ రాశివారికి ఈ రోజు అత్యంత శుభకరం. ఆపదలో ఉన్న మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు.
వృశ్చిక రాశి
ఈ రాశి స్త్రీ, పురుషులకు గృహోపకరణాలు, బహుమతులు, సన్మానాలు పెరుగుతాయి. సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు, ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించే అవకాశముంది. మీరు రచనా రంగంలో, మేధో రంగంలో చురుకుగా ఉంటారు. కవులకు, సైంటిస్ట్ లకు అనుకూలమైన రోజు. మీరు శారీరక అలసట వలన కొంత అసహనానికి లోనవుతారు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు విద్యారంగంలో ఊహించని విజయం సాధిస్తారు. ఇంతవరకు చేసిన ప్రయత్నాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. బహుమతులు, సన్మానాలు పెరుగుతాయి. సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు మీ అనైతిక సంబంధాలను నియంత్రించాలి. ఈ రోజు కుటుంబ సంబంధాలలో నమ్మకంతో కూడిన ప్రేమ అవసరమవుతుంది. మీ భాగస్వామి మనసులో మీ పై ఉన్న అపనమ్మక భావనను తొలగించడానికి ప్రయత్నించండి.
మకర రాశి
జీవనోపాధి కోసం మీరు చేసిన కృషి ఫలితంగా మీరెంచుకున్న రంగంలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సంబంధాలు బలపడతాయి. అధికార పక్షం నుంచి మద్దతు ఉంటుంది.మీ జీవితంలో అనవసర గందరగోళం ఏర్పడుతుంది. ఈరోజు సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీ ప్రియమైన వ్యక్తి ఇంటర్వ్యూలలో విజయం సాధించవచ్చు. అవివాహతులకు విదేశీ సంబంధం వచ్చే అవకాశముంది.
కుంభ రాశి
ఈ రాశి వారిని ఎప్పటి నుంచో బాధిస్తున్న సమస్య పరిష్కారమవుతుంది. బహుమతులు, సన్మానాలు పెరుగుతాయి. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. ఈ రోజు భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కనుక అనవసర వాదనలకు దిగొద్దు. ప్రేమ వ్యవహారాలు భార్యా భర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి.
మీన రాశి
మీ తెలివితేటలతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. బహుమతులు, సన్మానాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టండి. అప్రమత్తమంగా ఉండాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామితో మీరు గడిపిన టైం ఆనందాన్నిస్తుంది. ఈ రాశి వారు ప్రేమికులు సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. మీ ప్రియమైన వారు మీపై పెట్టుకున్న ఆశల్నిమీరు తీరుస్తారు. మీరు సోషల్ మీడియాలో ఈరోజు ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. మీ చుట్టూ ఉన్నవాతావరణాన్ని మీ మాటలతో ఆహ్లాదకరంగా మారుస్తారు.
************************
రాళ్లపల్లి సరస్వతీదేవి