మేష రాశి (Aries)
ఈ రాశి వారికి ఈ రోజు శుభదినం. ఉద్యోగులకు ఆఫీస్ లో తగిన గౌరవం లభిస్తుంది. ఉన్నతాధికారులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీరు భాగస్వామ్య వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు మీ భార్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీకు గొంతు సంబంధిత ఇబ్బందులు తలెత్తవచ్చు. డాక్టర్ని సంప్రదించి సమయానికి మందులు వాడండి. లేకపోతే మీ వ్యాధి మరింత తీవ్రమవుతుంది. మీరు మీ కుటుంబానికి సంబంధించిన కొన్ని కొత్త బాధ్యతల నిర్వర్తిస్తారు. కుటుంబ పోషణ కోసం పెరిగిన ఖర్చు కారణంగా మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
వృషభ రాశి (Taurus)
ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజు. మీకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ అవుతాయి, దీని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్ధిక సంబంధ విషయాల్లో, పెట్టుబడుల్లో నిర్ణయం తీసుకుంటే కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం. ఆర్ధిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మీకు నష్టాలు రావచ్చు. మీరు సాధించే విజయాలే మీకు శత్రువులను తెచ్చి పెడుతుంది. అప్రమత్తంగా ఉండండి. వ్యారస్తులు మీ వృత్తికి సంబంధించిన ప్రయాణం చేయవలసి ఉంటుంది. దీని వలన మీకు ధనలాభం, పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. అవివాహితులకు వివాహా సూచన కలదు. కొన్ని శుభవార్తలు వినే అవకాశముంది.
మిథున రాశి (Gemini)
మీరు చేసే పని, శ్రమ కారణంగా సమాజంలో, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఏదైనా సామాజిక సేవ చేయాలన్నా, సామాజిక సంస్థలో చేరాలనుకున్నా, మీరు దాని నుంచి ప్రయోజనం పొందుతారు. మీ మనస్సు కూడా శాంతిని పొందుతుంది. స్థిర చరాస్తిలకు సంబంధించిన లావాదేవీలకు ఈ రోజు అనుకూలం. ఇందులో మీకు లాభం ఉంటుంది. కొత్త వాహనం కొనడానికి ఈ రోజు మీకు శుభదినం. మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆందోళన పడకండి. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. వాదోపవాదాల జోలికి వెళ్లవద్దు. కుటుంబ కలహాలు ఈ రోజు పరిష్కారమై కుటుంబంలో శాంతి నెలకొంటుంది. పెద్దలు సంతృప్తి చెందుతారు. మీకు ఈ రోజు ఇంట్లో కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.
కర్కాటక రాశి (Cancer)
ఈ రాశి వారికి ఈ రోజు అంతా అనుకూలంగా లేనందున నూతన కార్య క్రమాలు వాయిదా వేస్తే మంచిది. వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా పెట్టుబడులు పెట్టకండి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న నిర్ణయాన్ని మానుకోండి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. వీరి కారణంగా నష్టం వాటిల్లవచ్చు. వాహనం ప్రమాదం జరిగే అవకాశముంది. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు నివారించండి. మీ కుటుంబంతో కొంత సమయం గడపండి సంతోషంగా ఉంటుంది.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మేలు జరుగుతుంది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశముంది. జాగ్రత్త పడండి. లేదంటే అవి మీ వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఆస్తికి సంబంధించిన కోర్టు వ్యవహారాలు కలిసి రావు, వృథా ఖర్చు అవుతుంది. మీరు తీర్థ యాత్రలు వాయిదా వేస్తే మంచిది. దూర ప్రయాణాలకు కూడా వెళ్లవద్దు. మీరు ప్రమాదాన్ని ఎదుర్కోవలసి రావచ్చు.
కన్యారాశి (Virgo)
ఈ రోజు మీకు శుభదినం. వ్యాపారస్తులకు ఆర్ధిక విషయాల్లో లాభం ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టటం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి చూపిస్తారు. స్నేహితుల సహకారంతో మీ ఇబ్బందులు తొలగిపోతాయి. మీ సన్నిహితులపై నమ్మకంతో ముందుకు సాగండి. మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకుంటారు. వారి వలన ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తి అయి ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో దెబ్బతిన్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది, దీంతో మీ మనస్సు సంతృప్తి చెందుతుంది.
తులా రాశి (Libra)
కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ధన లాభం. మీ కుటుంబంలో వివాదాలు తలెత్తవచ్చు. పెద్దల జోక్యంతో వాటిని పరిష్కరించుకోండి. ఈ రాశి వారికి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. అనారోగ్య సూచన కారణంగా ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి. మీ ప్రత్యర్థులు మీపై కుట్రలు పన్నుతారు కనుక వారికి దూరంగా ఉండండి.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేనందున మాటల్లో సంయమనం పాటించండి. మీకు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి వాటి కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. అనారోగ్య సూచన ఉంది. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి. మీ సన్నిహితుల నుంచి విచారకరమైన వార్తలను వింటారు. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా లేనందున వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కోవచ్చు. ఆర్ధిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. లేదంటే ధన నష్టం జరిగే అవకాశముంది. కుటుంబ సభ్యులతో విబేధాలతో మీ మనసు గాయ పడుతుంది. దీని వల్ల మీ కుటుంబ శాంతికి భంగం కలుగుతుంది. కాబట్టి మీ మాటను నియంత్రించండి, ఆచితూచి మాట్లాడండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రమాదం జరిగే అవకాశముంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అవాంఛనీయ సంఘటనల కారణంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. మీ పనులతో బిజీగా ఉండటం వల్ల మీ మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశముంది మీ మాటలను నియంత్రించండి. ఆర్ధిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి. వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో లావాదేవీలకు దూరంగా ఉండండి, మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేసి మీకు నష్టం చేకూర్చవచ్చు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
మకర రాశి (Capricorn)
ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ చేపట్టే క్రమంలో ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీ పురోగతికి అవకాశాలు మెరుగుపడతాయి. మీ కుటుంబంలో శుభకార్యక్రమాలు జరిగే అవకాశముంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. నూతన వాహనం కొనుగోలుకు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పిల్లల కారణంగా ఆందోళన చెందుతారు.
కుంభ రాశి (Aquarius)
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభదినం. వ్యాపారస్తులు భారీ లాభాలను పొందుతారు. కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అహంకారాన్ని దరి చేరనీయకండి. ఇతరులతో ప్రేమగా మెలగండి. మీరు స్నేహితుల మద్దతుతో పనులు పూర్తి చేస్తారు. పిల్లల కారణంగా మీరు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు.
మీన రాశి ( Pisces)
ఈ రోజు ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారస్తులు కొన్ని నష్టాలను చవిచూస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న మీ ఆలోచనని వాయిదా వేయండి. లేదంటే మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు ఏర్పడి దూరం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన వ్యయం. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన విభేదాలు త్వరగా పరిష్కరించి, కుటుంబ సభ్యులను సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. దీంతో పెద్దలు కూడా సంతోషిస్తారు.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.