మేష రాశి (Aries)
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ప్రత్యేకమైన పని చేసి సంతోషపడతారు. మనస్సు సృజనాత్మక పనిలో నిమగ్నమై ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారు మీ పనుల రీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ ప్రయాణం ఆహ్లాదకరంగా, ప్రయోజనంగా ఉంటుంది. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. మిత్రులతో సంబంధాలు కొంచెం దెబ్బతింటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభ రాశి (Taurus)
ఈ రోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త ప్రణాళికలు పూర్తి చేస్తారు. ఎవరి మీదా ఆధారపడకుండా మీ పని మీరు పూర్తి చేసుకుంటే మీకే మంచిది. ముఖ్యమైన పనుల్లో ఇతరుల జోక్యం వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో నష్టాన్ని చవిచూడవచ్చు. జీవనోపాధి విషయంలో సాగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహకారం ఉంటుంది.
మిథున రాశి (Gemini)
ఈ రోజు మీకు ముఖ్య మైన రోజు. భవిష్యత్తుకి ఉపయోగపడే అనేక ఒప్పందాలు చేసుకుంటారు. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం తగ్గటం కోసం సుందరకాండను పఠించండి.
కర్కాటక రాశి (Cancer)
ఈ రాశి వారికి ఈ రోజు ప్రారంభంలో పనులు అధికంగా ఉంటాయి. సోదరీమణులతో వివాదాలు చెలరేగే అవకాశముంది. వాటి కారణంగా విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీరు చేసే పనులను గుర్తిస్తారు, వారి నుంచి ప్రశంసలు అందుతాయి. పిల్లల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది.
సింహ రాశి (Leo)
ఉద్యోగస్తులకు ఈ రోజు చికాకులు, వివాదాలు తప్పవు, సహోద్యోగులతో విబేధాలు ఏర్పడతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయం పెరుగుతుంది. మత విశ్వాసాలపట్ల నమ్మకం, ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు హనుమంతునికి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి.
కన్యారాశి (Virgo)
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీ, పురుషులు ప్రయాణంలో మీ వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి లేదంటే విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. వృత్తిపరమైన పనులు సజావుగా నెరవేరుతాయి. కొత్త వ్యాపార ప్రతిపాదనలు అందుకుంటారు. వాహన ఖర్చులు పెరుగుతాయి. పిల్లల చర్యలు ఆందోళనను, అసహనాన్ని పెంచుతాయి.
తులా రాశి (Libra)
ఈ రోజు ఈ రాశి స్త్రీ, పురుషులకు అత్యంత శుభదినం. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులకు, వ్యాపార పరిధి విస్తరణకు అనుకూలమైన సమయం. నూతన కార్యక్రమాలకు విశేష కృషి అవసరం. స్నేహితుల సహకారంతో కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. అంతర్జాతీయ వ్యాపారాలతో సంబంధం ఉన్నవారు కీర్తిని పొందుతారు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రోజు ఈరాశి వారికి శుభ దినం. మునపటి రోజు కంటే ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ విశేష ప్రతిభతో కుటుంబ ప్రతిష్ఠను పెంచుతారు. వ్యాపారస్తులకు కొన్ని చికాకులు తప్పవు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు పరస్పర వైరుధ్యం కారణంగా వ్యాపారంతో పాటు మీ సంబంధాలు కూడా ప్రభావితం అవుతాయి. ఆకస్మిక ధనలాభం. ఈ రోజు మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. మీ చుట్టూ శాంతి నెలకొంటుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రోజు ఈ రాశి వారు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది. మంచి వ్యక్తులను కలుస్తారు, వారు మీ శ్రేయోభిలాషులుగా మారుతారు. కోపం, ఉద్వేగంపై సంయమనం పాటించండి. పిల్లల పెళ్లి విషయంలో ఆందోళన ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశముంది. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. సంపద, కీర్తి వృద్ధి చెందుతాయి.
మకర రాశి (Capricorn)
ఈ రోజు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులను తెలివిగా, విచక్షణతో పూర్తి చేస్తారు. పిల్లల పురోగతి వలన మీరు సంతోషిస్తారు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకండి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వాహనాన్నినడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ప్రమాదాలు జరిగే అవకాశముంది. మీరు మీ జీవిత భాగస్వామి మద్దతు సాంగత్యాన్ని పొందుతారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి.
కుంభ రాశి (Aquarius)
ఈరోజు మీకు అత్యంత శుభ దినం. మీ ప్రణాళికలను, రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోకండి. అన్ని రంగాల వారికి అనుకూలమైన సమయం. పనుల్లో వేగం పెరుగుతుంది. ఏ వ్యవహారంలో అయినా తొందర పాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆచితూచి వ్యవహరించండి. స్థిర, చరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మీన రాశి ( Pisces)
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. నిర్లక్ష్యం వద్దు. కుటుంబం వాతావరణం కొంచెం టెన్షన్ గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్షీణత వలన కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త పరిచయాలు, స్నేహాలు కలిసి వస్తాయి.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.