మేష రాశి (Aries)
ఈరోజు ఈ రాశి వారు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ వీటిని మీరే ధైర్యంగా పరిష్కరించుకుంటారు. మీ సామర్థ్యం వలన మీరు ప్రత్యేక గుర్తింపును పొందుతారు. తెలివితేటలతో పనులు పూర్తి చేస్తారు. సృజనాత్మక రంగంలో మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ రోజు మీకు మంచి రోజు. వ్యాపారంలో నష్టాలను చవిచూడవలసి రావచ్చు, మీరు కుటుంబ సభ్యులతో అనవసరమైన తగాదాలు పెట్టుకోకండి. షేర్ మార్కెట్ ఈ రోజు మీకు అనుకూలం కాదు. ఆస్తి సంబంధిత ఒప్పందాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి.
వృషభ రాశి (Taurus)
ఈ రాశి వారికి ఈరోజు శుభదినం. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సృజనాత్మక ప్రయత్నం ఫలిస్తుంది. మీ కుటుంబ జీవితం ఈ రోజు చాలా బాగుంటుంది. మీ ప్రణాళికలు నెరవేరుతాయి. పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా ఉంటారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఏ చిన్న పనిని ప్రారంభించినా అది భవిష్యత్తులో కలిసి వస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మిథున రాశి (Gemini)
జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం పట్ల అవగాహన, శ్రద్ధ అవసరం. వ్యాపారంలో అధిక లాభం కారణంగా, మీరు ఈ రోజు అలసటను మరచిపోతారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఈ రోజు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు. మీరు మీ జీవిత భాగస్వామి సాంగత్యాన్ని పొందుతారు. ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి.
కర్కాటక రాశి (Cancer)
ఈ రోజు మీకు ఆర్థిక విషయాలలో విజయం ఉంటుంది. కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. ప్రేమికులకు అనుకూలమైన సమయం. ఈ రోజు అన్ని రంగాల వారు లాభాలను పొందే అవకాశం ఉంది. ఇది వరకు మీరు ఇచ్చిన రుణాలు ఈ రోజు తిరిగి పొందుతారు. మీ పురోగతికి అడ్డుగా ఉన్న ఆటంకాలు ఈ రోజు తొలగిపోతాయి. వ్యాపారస్తులు మీ వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళతారు.
సింహ రాశి (Leo)
ఈ రోజు మీకు అత్యంత శుభదినం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పని పూర్తి చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వృత్తిపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రణాళికలను అమలు చేయడానికి ఈ రోజు మంచి రోజు. కోర్టు వ్యవహారాల్లో అపజయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు ఈ రోజు ముగుస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు మీకు అనుకూలంగా లేనందున, రిస్క్ తీసుకోకండి. ఒక వేళ పెట్టాల్సి వస్తే కొంచెం మొత్తంలో పెట్టండి. అవివాహితులకు వివాహ సూచన కలదు.
కన్యారాశి (Virgo)
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అశ్రద్ధ వద్దు. తండ్రి లేదా మత గురువు నుంచి ఒత్తిడిని పొందవచ్చు. అహంకారంతో సన్నిహితులను దూరం చేసుకోకండి. ఈరోజు మీరు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు, ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యుల్లో మీరు ప్రత్యేక స్థానం పొందుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తవుతాయి, ముఖ్యమైన సమాచారాన్ని బయటి వ్యక్తులతో పంచుకోవద్దు.
తులా రాశి (Libra)
ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వృత్తిపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. కొత్త ఇల్లు, దుకాణం, వాహనం మొదలైనవి కొనుగోలు చేయాలనే కల నెరవేరుతుంది. మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఈ రోజు మంచి రోజు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలను వినవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారాల సహాయ సహకారాలుంటాయి. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. ఈ రోజు మీరు సృజనాత్మక పనిలో ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి భాగస్వామ్య వ్యాపారం కలిసి రాదు. వివాదాలకు దూరంగా ఉండండి. లేకుంటే చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అధికారులు మీ పని పట్ల సంతృప్తిగా ఉంటారు. మీరు ప్రభుత్వ పథకంలో పెట్టిన పెట్టుబడి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వృత్తి పరంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఈ రోజు, అవివాహితులకు మంచి ప్రతిపాదనలు వస్తాయి. ఈ రోజు మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి ప్రత్యేకమైన రోజు. ఉద్యోగస్తులు ఆఫీస్ లో కొత్త ప్రణాళికలను ప్రారంభించవచ్చు. కుటుంబానికి కొంత సమయం కేటాయించండి. అనవసర వివాదాలకు, చర్చలకు దూరంగా ఉండండి. మాటల్లో సంయమనం పాటించండి. కుటుంబంలోని వ్యక్తులు ఈరోజు మీ మాటలకు పూర్తి గౌరవం ఇస్తారు.
మకర రాశి (Capricorn)
ఈ రాశి వారు ఈరోజు సృజనాత్మక పనులలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లలు లేదా బంధువు కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ ప్రేమని వ్యక్తపరచటానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. మీరు ప్రేమలో విజయం పొందుతారు. మీరు మీ పనులను ఏకాగ్రతతో చేయాలి. తొందరపాటుతో వ్యవహరిస్తే, నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. భార్యా భర్తల మధ్య విబేధాలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
కుంభ రాశి (Aquarius)
ఈరోజు కుంభ రాశి వారికి అన్ని విధాలా యోగ్యంగా ఉంటుంది. వ్యాపార విషయాలలో విజయం సాధిస్తారు. పిల్లల బాధ్యత నెరవేరుతుంది. ఈ రోజు, సంకోచం లేకుండా మీ అభిప్రాయాన్ని అందరి ముందు ఉంచండి. ఈ రోజు మీరు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండవలసిన రోజు. వాహన ప్రమాదం పొంచి ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించండి. విద్యార్థులు ఏదైనా పరీక్షల్లో విజయం సాధిస్తారు.
మీన రాశి (Pisces)
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. అనారోగ్యం కారణంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు మీరు ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు అనవసర పనులకు దూరంగా ఉండాలి, లేదంటే సమస్యలు వస్తాయి. మీరు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించగలుగుతారు. కొన్ని తగాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు మీ ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తే మంచిది.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.