మేష రాశి (Aries)
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. పిల్లలతో తలెత్తిన వివాదాలు సమసిపోతాయి. చదువులో ఏర్పడ్డ అంటకాలను ఎదుర్కొంటూ విద్యార్థులు కష్టపడి ముందుకు సాగితే, విజయం సాధించగలుగుతారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు పూర్తి చేస్తారు. మీ పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు.
వృషభ రాశి (Taurus)
ఈ రోజు మీకు సౌఖ్యాలు, సౌకర్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు చేసే వ్యక్తులు దూర పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీ ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. మీరు భవిష్యత్తు కోసం కొంత ధనాన్ని ఆదా చేసుకోవాలి, లేకుంటే మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీపై ఆధిపత్యం చలాయించేందుకు, మీకు చెడు చేయటానికి ప్రత్యర్థులు తమ వంతు ప్రయత్నం చేస్తారు. అప్రమత్తంగా ఉండండి.
మిథున రాశి (Gemini)
ఈ రోజు మీకు మిశ్రమ ఫలప్రదంగా ఉంటుంది. సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు ప్రజలకు అవగాహన కల్పించే అవకాశాన్ని పొందుతారు . మీ అదృష్టం మీకు తోడ్పడుతుంది. దాని కారణంగా మీరు పురోగతి సాధిస్తారు. అవివాహితులకు వివాహ సూచన. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అధికారులు మీకు ఇచ్చిన బాధ్యతను సకాలంలో పూర్తి చేయాలి, లేకపోతే మీరు చిక్కుల్లో పడతారు.
కర్కాటక రాశి (Cancer)
ఈ రోజు మీకు మిగిలిన రోజుల కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు వర్క్ చేసే చోట గొడవలు తలెత్తితే, మీరు జోక్యం చేసుకోకండి. దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారంలో పెండింగ్లో ఉన్న పనులు ఈ రోజు మీరు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, మీరు ఈ రోజు కొత్తగా స్థిర, చరాస్తులు కొనే అవకాశముంది. కుటుంబ సబ్యలతో, మీ పిల్లలతో కొంత టైమ్ స్పెండ్ చేయండి.
సింహ రాశి (Leo)
ఈరోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయాన్ని పొందుతారు. మీరు ఎవరితోనైనా భాగస్వామ్య వ్యాపారం చేయాల్సి వస్తే, ఆచితూచి నిర్ణయం తీసుకోండి. పెట్టుబడులు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టకండి. మీ పిల్లల అవసరాలపై పూర్తి శ్రద్ధ వహించాలి, మీరు మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు.
కన్యారాశి (Virgo)
ఈ రోజు మీకు అధిక ఖర్చులుంటాయి. వాటి కారణంగా మీరు సమస్యలను ఎదుర్కొంటారు. పెరుగుతున్న ఖర్చుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వాహనాన్ని నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోకపోతే, తర్వాత సమస్యలను ఎదుర్కోవచ్చు. కుటుంబంలోని సభ్యుల అవసరాలను తీర్చడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి.
తులా రాశి (Libra)
ఈ రోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈ కారణంగా మీరు ఆనందంగా ఉంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు భాగస్వామ్యంతో ఏ ఒప్పందాన్ని చేయకూడదు, అది మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఆకస్మిక పర్యటనకు వెళ్లవలసి రావచ్చు. మీరు మీ స్నేహితుల సహాయం పొందుతారు. మీ ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చలాయించడానికి చూస్తున్నారు నివారించండి.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రోజు ఈ రాశి వారు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సహనంతో ఉండవలసిన రోజు. పిల్లల కెరీర్లో ముందుకు సాగుతారు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. విదేశాలకు వెళ్లాలని అనుకున్న వారి కోరిక ఈ రోజు నెరవేరుతుంది. మీ మనసులో దాగున్న కోరికలు నెరవేరడం వల్ల, ఈ రోజు కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశముంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రోజు మీరు మీ పనిని నమ్మకంతో చేస్తే, అది ఖచ్చితంగా పూర్తవుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తి చేయగలుగుతారు. భావోద్వేగాల ప్రభావంతో ఈ రోజు ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి, దానివల్ల మీరు తర్వాత పశ్చాత్తాప పడతారు. మీకు మీ పిల్లల మద్దతు పుష్కలంగా లభిస్తుంది. ప్రేమికులకు అనుకూల సమయం. మీ ప్రేమను మీ పెద్దలు అంగీకరించవచ్చు.
మకర రాశి (Capricorn)
ఈ రోజు మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడ్డ విభేదాల కారణంగా మీరు ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ పెద్దల కారణంగా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు మీకు ప్రమాద సూచన ఉంది అప్రమత్తంగా ఉండండి. వ్యాపారంలో ఆశించిన లాభం రాకపోవడం వల్ల మీరు కొంచెం ఆందోళన చెందుతారు, అయినప్పటికీ ఆర్ధిక పరిస్థితి బానే ఉంటుంది
కుంభ రాశి (Aquarius)
ఈ రోజు మీకు ప్రతి విషయంలోనూ పురోభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులు ఈ రోజు మంచి ఉద్యోగం పొందవచ్చు, దాని కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుట పడుతుంది. ఏ విషయంలో అయినా మీరు మీ సోదరులను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే, అది మీకు మంచిది. జీవిత భాగస్వామి సలహా మీ కుటుంబ వ్యాపారానికి ప్రభావవంతంగా ఉంటుంది. స్నేహితులతో విబేధాలు తొలగిపోతాయి.
మీన రాశి (Pisces)
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీకు వ్యాపారంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోయి, ఆందోళన తగ్గుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన కొన్ని పనులు ఈ రోజు పూర్తవుతాయి. మీ ప్రత్యర్థులు ఈ రోజు మీపై ఆధిపత్యం చలాయించడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ప్రేమికుల మధ్య విబేధాలు తలెత్తే అవకాశముంది. దీని కారణంగా మీ సంబంధం విచ్ఛిన్నం కావచ్చు. సంయమనం పాటించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.