మేష రాశి (Aries)
ఈ రోజు ఈ రాశి వారు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త విషయాలపై కుతూహలం పెరుగుతుంది. ఆత్మీయులని కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులందరూ సమావేశం అయ్యే అవకాశముంది. ఆడంబరాలకు దూరంగా ఉండండి. కుటుంబ కలహాలు సమసిపోయి అందరి మధ్య సయోధ్య కుదురుతుంది. రుణాలు తీసుకోవడం మానుకోండి.
వృషభ రాశి (Taurus)
ఈరోజు ఈ రాశి స్త్రీ, పురుషులకు మిశ్రమ ఫలితాలుంటాయి. జాతకం ప్రకారం ఉద్యోగంలో పదోన్నతులు, బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సహకార వాతావరణం ఉంటుంది. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పని చేయండి, తప్పక విజయం సాధిస్తారు. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యకి ప్రణాళికలు వేయటానికి అనుకూలమైన రోజు.
మిథున రాశి (Gemini)
ఈ రోజు ఈ రాశి వారికి అత్యంత శుభదినం. మీ కుటుంబ సభ్యులతో వైరం పెంచుకోకండి. తారతమ్యాలు లేకుండా అందరితో సమానంగా మెలగండి. వ్యాపారస్తులు ఈ రోజు మీ తెలివితేటలతో ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులను కానీ, ప్రియమైన వ్యక్తిని కానీ ఈ రోజు కలుస్తారు. ఆస్తి లావాదేవీలలో అప్రమత్తంగా ఉండండి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది
కర్కాటక రాశి (Cancer)
ఈరోజు మొత్తం మీకు సమస్యలు, చికాకులతో గడుస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలమైన రోజు. మీరు ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో స్వచ్ఛందంగా బదిలీ చేయకపోవడం వల్ల మనసు చికాకుగా ఉంటుంది. పదోన్నతి పొందే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధిక ధనవ్యయం కూడా ఉంటుంది.
సింహ రాశి (Leo)
ఈ రోజు శుభదినం. అన్ని పనులు మీకు అనుకూలంగా జరుగుతాయి. మీ స్వంత శక్తితో పని చేయండి. ఇతరులపై ఆధారపడకండి. ఉద్యోగస్తులు ఆఫీస్ లో ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. చాకచక్యంతో పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఆకస్మిక ధనలాభం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
కన్యా రాశి (Virgo)
ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారు కొత్త వ్యాపార ప్రణాళికలు వేసుకుని వాటిని అమలు చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు పెద్ద నాయకులను కలుస్తారు. కళాత్మక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అత్యాశకి పోవద్దు, అత్యాశ వలన చేతికి అందింది కూడా కోల్పోతారు.
తులా రాశి (Libra )
ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం మీద బాగానే ఉంటుంది. మీ పై మీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రతికూల ఆలోచనలు దరిచేరనివ్వకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి, విజయం తప్పకుండా వస్తుంది. మీ జీవిత భాగస్వామి పురోగతి వలన సామాజిక గౌరవం పెరుగుతుంది. ప్రేమికులు మీ ప్రేమని పెద్దల అంగీకారంతో గెలిపించుకుంటారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రోజు ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేనందున, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మాటల్లో సంయమనం పాటించండి. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఎదురవటం వల్ల, మీ ఆసక్తి మేరకు పనులు జరగకపోవడంతో ఆగ్రహానికి గురవుతారు. మీ కోపాన్ని మీ నియంత్రణలో ఉంచుకోండి. అది మీకే మంచిది. ఈరోజు వ్యాపార విషయాలలో బాధ్యత పెరుగుతుంది. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రోజు మీకు అత్యంత శుభదినం. ఉద్యోగస్తులు బాగా కష్టపడి పనిచేస్తారు. మీ శ్రమకి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆఫీస్ లో కొత్త ప్రతిపాదనలు అందుతాయి. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణలో ఆర్థిక సహకారం తీసుకోవలసి ఉంటుంది.
మకర రాశి (Capricorn )
ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేనందువలన ఏ తొందర పాటు నిర్ణయాలు తీసుకోకండి. బాధ్యతల నుంచి పారిపోకుండా వాటిని నెరవేర్చటానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులు శ్రద్ధతో పనులు పూర్తి చేయాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లల చదువులు గూర్చి, ఆరోగ్యం విషయంలోనూ ఆందోళన పెరుగుతుంది. ఈరోజు అనవసర హడావుడి ఉంటుంది. అలసట, మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కొంటారు.
కుంభ రాశి (Aquarius)
ఈ రోజు మొత్తం మిశ్రమంగా ఉంటుంది. మీ ప్రత్యర్థుల వల్ల వ్యాపారంలో ఆటంకాలు వస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభించదు. దీని కారణంగా మీరు కొంచెం అసహనానికి గురవుతారు. నిరాశ ఆవహిస్తుంది. మీ సన్నిహితుల సహాయంతో సమస్యలు పరిష్కారమవుతాయి. వాహనాన్ని నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ప్రమాదం జరిగే సూచనలున్నాయి.
మీన రాశి ( Pisces)
ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈ రోజు అత్యంత శుభదినం. ఈ రోజు మీరు చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. మీ అధిక శ్రమ వ్యాపారంలో లాభాలను తెచ్చిపెడుతుంది. కుటుంబ సభ్యులంతా అన్యోన్యంగా గడుపుతారు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు సరైన మార్గదర్శకత్వంలో దిశా నిర్దేశం చేసుకోండి.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.