మేష రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక వనరులు బాగుంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. నూతన వాహనం కొనాలన్నఆలోచనని తండ్రితో షేర్ చేసుకుని వారి అభిప్రాయాలను పరిగణించండి. భాగస్వామ్యంతో కూడిన పెట్టుబడులు కలిసివస్తాయి. నూతన పనుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. వ్యాపారం చేసే వ్యక్తులు ఒప్పందాలను, ప్రణాళికలను చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. మీ సహచరులు మీ గురించి దుష్ప్రచారం చేసే అవకాశముంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
వృషభ రాశి
ఈ రాశి వారు ఈ రోజు అనవసర చర్చలకు దూరంగా ఉండండి . మీరు చేసే వర్క్ పై వేరే చోటికి ప్రయాణించాల్సి రావచ్చు. సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే మీకే మేలు జరుగుతుంది. పిల్లల చదువులో ఎదురవుతున్న సమస్యల గురించి ఆందోళన చెందుతున్న వారు ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలకు చెక్ పెట్టండి . మీరు మీ మనసులో నిగూఢంగా ఉన్న కోరికను తల్లితో పంచుకుంటారు. తల్లి మీ కోరికని కచ్చితంగా నెరవేరుస్తుంది.
మిథున రాశి
ఈరోజు మీరెంచుకున్న మార్గంలో పురోభివృద్ధి ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు పాత తప్పిదాలను గుర్తు పెట్టుకుని నడుచుకోండి. మీరు అపరిచిత వ్యక్తిని కలిసినట్లయితే వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు తల్లితండ్రుల ఆశీస్సులు తీసుకోండి అది మీకు మేలు చేస్తుంది.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు తలెత్తే అవకాశముంది. అవివాహితులకు ఉత్తమ వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఈరోజు మీ ఇంటికి అతిథుల రాక ఉంటుంది. ఈ కారణం వల్ల మీ డబ్బు ఖర్చు కూడా పెరుగుతుంది. కుటుంబంలోని వ్యక్తులు మీ మాటలకు పూర్తి గౌరవం ఇస్తారు. కార్యాలయంలో మీ ప్రత్యర్థులు కొందరు మీకు వ్యతిరేకంగా ఉండి, మిమ్మల్ని వేధించే అవకాశాన్ని వదిలిపెట్టరు.ఆర్థికాభివృద్ధి కోసం ప్రణాళికలు వేస్తారు
సింహ రాశి
ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ రోజు మొత్తం సమస్యలతో నిండి ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులకు కొన్ని పథకాలలో నిరాశ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశముంది. వాటిని నివారించటానికి ప్రయత్నం చేయండి. మీరు మీ అభిప్రాయాన్ని వెల్లడించక పోవటమే మంచిది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఓపికగా ఉండండి. భాగస్వామ్యంతో నడుస్తున్న వ్యాపారంలో మీరు నష్టాన్ని చవిచూడవచ్చు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన విషయాలలో, మీరు మీ అభిప్రాయాన్ని ఇతరుల ముందు ఉంచాలి. రాజకీయ రంగాలలో పనిచేసే వ్యక్తులు, ముఖ్య సదస్సుల్లో పాల్గొంటారు.
కన్యా రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఎక్కువ ఆర్ధిక వనరులుంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువులను కాపాడుకోవాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల కారణంగా మీరు ఇబ్బంది పడతారు. మీకు సన్నిహితంగా ఉన్న వారే మిమల్ని బాధపెడతారు. మీ చిన్ననాటి స్నేహితులు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడానికి వస్తారు. మీరు అతనితో సంతోషంగా గడపండి. ఈ రాశి వారు ఈరోజు ఆస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి.
తులా రాశి
ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. తల్లిదండ్రులతో కలిసి, మీ పిల్లల వివాహంలో వచ్చే సమస్య గురించి చర్చించవచ్చు. తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుంది, వైద్యుడిని సంప్రదించాలి. అప్పులు తీసుకోవడం మానుకోండి, లేకుంటే తిరిగి చెల్లించడం కష్టం. మీ పాత పొరపాట్లు మీ కుటుంబ సభ్యుల ముందు బయటపడతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు వ్యాపార విషయాలలో అనుకూలంగా లేనందున రిస్క్ తీసుకోకండి. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వ్యక్తులకు మరికొంత కాలం ఆందోళన తప్పదు. మీరు మీ దినచర్యలో మార్పులు చేసుకుంటే దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. మీరు అనవసర చర్చలకు దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు ఈరోజు ఎలాంటి చర్చలు చేయకుండా ఉంటే మీకు మంచిది. ఈ రోజు చేసే నూతన పనులు మీకు మేలు చేస్తాయి. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది, కానీ మీరు తప్పనిసరిగా మీ తల్లిదండ్రుల నుంచి సలహా తీసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా వివాహానికి అడ్డంకులు ఏర్పడితే ముందుగా చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోండి. మీ పాత లావాదేవీలు ఈ రోజు మీకు సమస్యగా మారవచ్చు. మీరు పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలను వింటారు.
మకర రాశి
ఈ రోజు మీరు కొత్త వాహనం కొనుగోలుకు అనుకూలం. పెద్దల సూచనలు, ఆశీర్వాదాలతో ముందుకు సాగండి. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీరు మీ కిందవాళ్లతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు ఏ పనినైనా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనుకోకుండా మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే వెంటనే క్షమాపణలు చెప్పేయండి, లేకుంటే అది పెద్ద తప్పు అవుతుంది. మీరు మీ తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
కుంభ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికాభివృద్ధి ఉంటుంది. మీరు ఇంతకు ముందు ఇచ్చిన బాకీలు వసూలవుతాయి. సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు గౌరవాన్ని పొందుతారు , మీ ఉద్యోగంలో ప్రమోషన్ కారణంగా అవధులు లేని ఆనందాన్నిపొందుతారు. ప్రయాణంలో మీరు ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. విహారయాత్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ కోరిక కూడా ఈరోజు నెరవేరుతుంది.
మీన రాశి
ఈ రాశి స్త్రీ పురుషులకు శుభ దినం. ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తెలియని వ్యక్తి వల్ల హాని మీకు కలగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. తద్వారా మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మీపై కోపంగా ఉండవచ్చు. ఈ రోజు మీరు ధనలాభాలను పొందుతారు. విద్యార్థులు మానసిక, వేదన నుంచి విముక్తి పొందుతారు. వ్యాపారస్తులు లాభ నష్టాలను బేరీజు వేసుకోకుండా ముందుకు సాగండి.
రాళ్లపల్లి సరస్వతీదేవి