మేష రాశి
ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఈ రోజు మీకు మీ భాగస్వామితో వివాదాలు తలెత్తే అవకాశముంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తి చేసే అవకాశముంది. మీ కారణంగా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. మీకు తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించండి. లేకుంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు, తద్వారా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి అత్యంత సంతోషకరమైన రోజు. మీరు బంధువుల ద్వారా కొన్ని శుభవార్తలను వినవచ్చు. ఉద్యోగులు ఆఫీస్ లో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వారు మీ పురోగతికి అడ్డంకులు తెచ్చే యోచనలో ఉంటారు. మీరు మీ జీవిత భాగస్వామి మద్దతు, సాంగత్యాన్ని సమృద్ధిగా పొందుతారు. ఒక ప్రత్యేక వ్యక్తి ద్వారా ఆగిపోయిన మీ పనులు పూర్తి అవుతాయి.
మిథున రాశి
ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఈ రోజు కుటుంబ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. విద్యార్థులు చదువుపై దృష్టి మరల్చి కష్టపడాల్సిన టైమ్ ఇది. ఉద్యోగులకు ఉన్నతోద్యోగ ప్రాప్తి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మీరు ఎటువంటి ముఖ్యమైన సమాచారాన్ని అపరిచితులతో పంచుకోకండి, వారు దాన్నిఉపయోగించుకుంటారు.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈరోజు కొన్ని చిక్కులు తప్పవు. ఏ పనీ పూర్తికాకపోవడం వల్ల టెన్షన్‌గా ఉంటారు. మనసులో ఏర్పడిన గందరగోళం వలన ఏ పనిపై శ్రద్ధ పెట్టలేరు. వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తులకు అనుకూలమైన రోజు కాకపోవటం వలన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. అనారోగ్య సమస్యలను విస్మరించకుండా ఉండండి. తల్లి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
సింహం
ఈ రాశి వారికి ఈ రోజు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. భాగసామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి, లేకుంటే మోసపోయే అవకాశముంది. మీ ఆరోగ్యం పరంగా కొన్నిఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక రోగాల వలన సమస్యలు పెరుగుతాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీరు ఈరోజు మౌనంగా ఉండటం మంచిది. మీరు పిల్లల కోసం ఆర్ధిక వనరులు ఏర్పాటు చేస్తారు. ఎవరికీ అప్పులు ఇవ్వకండి. ఎందుకంటే తిరిగి వాటిని పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రోజు మీరు మీ ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కన్యా రాశి
ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈ రోజు శక్తిమంతమైన రోజు కానుంది. మీలో అంతర్గతంగా ఉన్న శక్తి మిమ్మల్ని ప్రతి పని లో విజయం సాధించేలా చేస్తుంది. కానీ మీరు మీ శక్తిని సరైన పనిలో ఉపయోగించండి. అది మీకే మేలు చేస్తుంది. రాజకీయ రంగాలలో పనిచేసే వ్యక్తులు పెద్ద నాయకుడిని కలిసే అవకాశం పొందుతారు. మీ చుట్టూ ఉన్న వారి నుంచి మీరు గౌరవం పొందుతారు. కొత్త వాహనం కొనాలన్న మీ కోరిక ఈ రోజు నెరవేరే అవకాశముంది. గర్వం, అహం దగ్గరికి రానీయకండి లేకుంటే తర్వాత పశ్చాత్తాపపడతారు.
తులా రాశి
ఈ రోజు ఈ రాశి స్త్రీ, పురుషులు ఆధ్యాత్మిక కార్యకలాపాలవైపు మొగ్గు చూపుతారు. మీరు ఎప్పటి నుంచో వసూలు కానీ డబ్బును ఈ రోజు పొందుతారు. తద్వారా మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. విద్యార్థులు ఈ రోజు చదువులో బాగా రాణిస్తారు, దాని కారణంగా మీ తల్లిదండ్రులు సతోషంగా ఉంటారు. మీ వ్యాపారంలో నిలిచిపోయిన కొన్ని పనులు ఈరోజే పూర్తవుతాయి. గతంలో మీరు చేసిన తప్పిదాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వకండి. అవి మీకు తర్వాత సమస్యలను కలిగించవచ్చు. కుటుంబంలోని వ్యక్తులు మీ మాటలకు పూర్తి గౌరవం ఇస్తారు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు చాలా కష్టతరమైన రోజు. వ్యాపార రంగంలో ఉన్న వారు నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక పెట్టుబడుల్లో, ప్రణాళికల్లో జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందకుండా, వైద్యుల సలహా తీసుకోవాలి. మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే, అది మీకు సమస్యను తెచ్చిపెట్టవచ్చు. మీ పురోగతికి అడ్డంకి గా ఉన్న సమస్య ఈరోజు తొలగిపోతుంది. మీ తల్లిదండ్రులను తీర్థయాత్రకు తీసుకెళ్లే అవకాశముంది.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొంత నష్టపోయే అవకాశముంది. మీ ప్రత్యర్థులు కొందరు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశముంది. కొత్త పని ఏదైనా ఈరోజు ప్రారంభిస్తే దానివలన మీకు మేలు కలుగుతుంది. ఉద్యోగులు మీ వర్క్ గూర్చి మీ సహోద్యోగులతో డిస్కస్ చేయటం మంచిది. మీరు మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో గడుపుతారు. బంధువుల రాకపోకలుంటాయి.
మకర రాశి
ఈ రాశి వారికి ఈరోజు బాగానే ఉంటుంది. మీకు ఏదైనా చట్టపరమైన విషయంలో సమస్యలుంటే అవి ఈ రోజు తొలగి విజయం పొందవచ్చు. చెల్లాచెదురుగా ఉన్న వ్యాపారాన్ని ఓ కొలిక్కి తీసుకు రావటానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీరు షేర్ మార్కెట్, లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలను పొందవచ్చు, బ్యాంకింగ్ రంగాలలో పని చేసే వ్యక్తులు ప్రమోషన్ లాంటి కొన్ని శుభవార్తలను వింటారు. తండ్రితో అనవసర వాదనలకు దిగకండి.
కుంభ రాశి
ఈ రోజు, మీకు సంతోషకరమైన రోజు కానుంది. ఈరోజు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది. భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే, మీరు దాని నుంచి మంచి లాభం పొందవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారు రోజులో ఎక్కువ సమయం తమ వ్యాపార ప్రణాళికల కోసం, అభివృద్ధి కోసం గడపాల్సి వస్తుంది. ఈ రోజు మీ కోరికలు నెరవేరి సంతోషంగా ఉంటారు.
మీన రాశి
ఈ రాశి స్త్రీ, పురుషులు ఈరోజు జాగ్రత్త గా ఉండండి. మీకు ఈ రోజు హానికరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి రావచ్చు. మీరు కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు, ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. అవివాహితుల వివాహానికి ఎదురైన అడ్డంకులను, మీ స్నేహితులతో మాట్లాడి పరిష్కరించుకోండి. మీరు మీ కొత్త ఇల్లు, దుకాణం లాంటివి నిర్మిస్తుంటే అవాంతరాలు ఎదుర్కొంటారు. వివాదాలకు దూరంగా ఉండేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి.
రాళ్లపల్లి సరస్వతీదేవి