మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారు జీవనోపాధి రంగంలో పురోగతి సాధిస్తారు. మీ కుటుంబ జీవితం ఆనంద దాయకంగా ఉంటుంది. విద్యార్థులు, విద్యారంగంలో ఉన్న వారు పోటీలలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు అత్యంత శుభదినం. మీరు తల్లిదండ్రులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు కానీ, కార్యక్రమాలకు కానీ వెళ్లే అవకాశముంది.
వృషభ రాశి
ఈ రాశి వారికి చాలe కాలం నుంచి నెరవేరని పనులు ఈ రోజు పూర్తయి, దాని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఖ్యాతి పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ, సామాజిక సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈరోజు సన్నిహితుల వలన కొన్ని విభేదాలు తలెత్తే అవకాశముంది. నివారించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీలో దాగి ఉన్న ఉత్సాహం, శక్తి, రెండూ ఈ రోజు మిమ్మల్నికొత్త అనుభూతికి గురిచేస్తాయి.
మిథున రాశి
ఈ రాశి స్త్రీ, పురుషులకు వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీకు బహుమతులు, సన్మానాలు పెరుగుతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకు కొత్త కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఉద్యోగస్తులు ఆఫీస్ లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి, ఇది మిమ్మల్ని విజయ శిఖరాలకు తీసుకెళుతుంది. పది మందిలో మీ విలువను పెంచుతుంది.
కర్కాటక
ఈ రాశి వారికి ఈ రోజు సంతానానికి సంబంధించిన కొన్ని బాధ్యతలు నెరవేరుతాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఈ రోజు ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామి మద్దతు, సాంగత్యం లభిస్తుంది. మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మొత్తం మీకు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవాళ్లు దూర ప్రయాణాలకి ప్లాన్ చేసుకోవచ్చు. అనుకూలమైన సమయం.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశి ఉద్యోగస్తులకు ఆఫీస్ లో మహిళా అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబ, సామాజిక సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈ రోజు జీవిత భాగస్వామి మద్దతు పరిపూర్ణంగా ఉంటుంది. మీ కారణంగా మీ కుటుంబ ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేకపోవటం వలన తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈరోజు వ్యాపారంలో మోసపోయే అవకాశం ఉంది. ఈ రాశి పురుషులు మీ భార్య మనోభావాలను గౌరవించండి
కన్యా రాశి
ఈ రాశి వారు ఈ రోజు తండ్రి నుంచి అయినా , మత గురువు నుంచి అయినా మద్దతు పొందుతారు. ఈ రోజు మీరు ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఊహించని ప్రయోజనం లభిస్తుంది. పదిమందిలో మీ సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులు విభిన్న ఆలోచనలతో, సందర్భానుసారం వినూత్న వ్యూహాలను అవలంబించడానికి ఈ రోజు అనుకూలమైన రోజు.
తుల రాశి
ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు అంత అనుకూలంగా లేకపోవటం వలన కొన్ని చిక్కులు ఎదురవుతాయి. కొంత ఆందోళనకు గురి కావాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీస్ లో మహిళా అధికారి నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది . ఈ రోజు మీరు మీ స్నేహితుల నుంచి మంచి సలహాలు అందుకుంటారు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ కారణంగా మీ కుటుంబ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఈ రోజు మీ సంతానానికి సంబంధించిన కొన్ని బాధ్యతలు నెరవేరుస్తారు. మీకు ఈ రోజు బహుమతులు, సన్మానాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీస్ లో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం తారస్థాయికి చేరుకుంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి.
ధనుస్సు రాశి
ఈ రాశి వారు ఈ రోజు అంటు వ్యాధుల వలన కానీ, లేదా శత్రువులు వలన కానీ ఒత్తిడికి గురవుతారు. మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాశి వారికి అన్ని పనుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్ థింకింగ్ కలిగి ఉంటారు. మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రజలను ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తారు.
మకర రాశి
ఈ రోజు మీకు సంతాన బాధ్యత నెరవేరుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. విద్యారంగంలో ఉన్న వారు పోటీలలో విజయం సాధిస్తారు.ఈ రోజు మీరు మీ తెలివితేటలతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీరు బంధువుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. ఈ రోజు మొత్తం మీకు అత్యంత శుభ దినంగా కొనసాగుతుంది.
కుంభ రాశి
ఈ రాశి వివాహిత పురుషులకు కుటుంబంలోని స్త్రీల నుంచి ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారరంగంలో ఉన్నవారికి వ్యాపార వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. మీరు ఈ రోజు ప్రయాణం చేస్తున్నట్టయితే పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజు ఓటమి భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగండి. కేవలం మాటల్లో కాకుండా చేతల్లో పనులు పూర్తి చేయండి. విజయం పొందుతారు.
మీన రాశి
ఈ రోజు ఈ రాశి వారికి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఈ రోజు సృజనాత్మక రంగంలో మెరుగు పడతారు. మీ సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. మీరు మంచి ఆరోగ్యంతో హాయిగా ఉంటారు. స్నేహితులతో కలిసి కొంత సమయాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆదాయం వృద్ధిలోకి వచ్చి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
రాళ్లపల్లి సరస్వతీదేవి