కొన్నిరాశుల వారు తెలివి తేటలతో పనులు పూర్తి చేస్తారు. కొందరికి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారు తెలివితేటలతో సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఎప్పటినుంచో మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కారణంగా కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి మనస్పర్థలు వచ్చే అవకాశముంది. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. సంయమనం పాటించండి.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి స్త్రీ పురుషులకు ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి మద్దతు, సాంగత్యాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్లేవారికి అనుకూలమైన సమయం, పరిస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య కొన్ని విబేధాలు తలెత్తుతాయి. అసంతృప్తిని ఎదుర్కొంటారు. ఈ కారణంగా, దూరం ఏర్పడే అవకాశముంది.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారు చేసే ప్రయత్నం అర్థవంతంగా ఉంటుంది. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆర్ధిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల అవగాహన, శ్రద్ద అవసరం. భావోద్వేగ నిర్ణయాలకు అనుకూల సమయం కాదు, ఎందుకంటే ఈ టైం లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేయడం కష్టం.
కర్కాటక రాశి
మీ తెలివి తేటలతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఈ రోజు మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. ఈ రోజు మీకు అత్యంత శుభదినం. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు, ప్రణాళికలు,కలిసి వస్తాయి. వాటి వల్ల భవిష్యత్తులో ప్రయోజనం పొందుతారు.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులుకు ఉన్నత అధికారుల నుంచి, సహోద్యుగుల నుంచి సహాయం పొందుతారు. మీలో ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. విద్యార్థులు పోటీలలో విజయం సాధిస్తారు. విద్యా విషయంలో సాగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. మీ శ్రమ ఫలిస్తుంది. పిల్లల వైపు నుంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
కన్యా రాశి
మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుడు లేదా సోదరి కారణంగా అనవసర డబ్బు ఖర్చు ఉంటుంది. మీరు ఈ రోజు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు పోటీలలో బాగా రాణిస్తారు. వారు కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలమైన సమయం. ఇంటర్వ్యూ లో విజయం సాధిస్తారు.
తులా రాశి
ఈ రాశి వారు ఈ రోజు మీరు సృజనాత్మక పనులలో విజయం సాధిస్తారు. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం , మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఏదైనా సామాజిక కార్యం వైపు కానీ, ఆధ్యాత్మిక విషయాలపై కానీ మీ మనస్సు నిమగ్నమవుతుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి స్త్రీ పురుషులకు అన్నిటా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు సంబంధిత అధికారుల సహకారం లభిస్తుంది. కుటుంబ, సామాజిక సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది . వృత్తి పరంగా ఈ రోజు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. ఈ రోజు ఎవరైనా మీతో గొడవకి ప్రయత్నించవచ్చు కనుక వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ఏ పని చేసిన విజయం సాధిస్తారు, ఆర్థిక లాభం, అదృష్ట వృద్ధి, ఈ రోజు మీకు సమృద్ధిగా ఉంటాయి.
ధనుస్సు రాశి
ఈ రాశి స్త్రీ పురుషులు ఈ రోజు మీ జీవిత భాగస్వామి, మద్దతు, సాంగత్యాన్ని పొందుతారు. కుటంబం సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త పరిచయాలు, కమ్యూనికేషన్స్ వ్యాపారానికి కొత్త దిశను ఏర్పాటు చేస్తాయి.
మకర రాశి
ఈ రాశి వారు విదేశాలకు వెళ్లే ప్రణాళికలకు ఈ రోజు మంచి రోజు. విదేశాలకు వెళ్లే వారికి ఈ
రోజు ప్రయాణం ఆహ్లాదకరంగానూ, ప్రోత్సాహకరంగానూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. ఈ రోజు మొత్తం మీకు బాగానే ఉంటుంది. మీ మనసులో కొత్త ఆలోచనలకు ఆస్కారముంది. మీరు నూతన ప్రణాళికలను సిద్ధం చేయవచ్చు.
కుంభ రాశి
విద్యార్థులకు ఈ రోజు అంత అనుకూలం కాదు. పోటీల కోసం ధనం వెచ్చిస్తారు. ఈ రాశి స్త్రీ పురుషులకు జీవిత భాగస్వామితో అనవసర విభేదాలు ఉండవచ్చు నివారించటానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త ప్రేమ సంబంధాలను ఏర్పరుచుకునే అవకాశాలుఎక్కువగా ఉన్నాయి కానీ వ్యక్తిగత , రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ఉండండి.
మీన రాశి
మీరు చేసే సృజనాత్మక ప్రయత్నం ఈ రోజు ఫలిస్తుంది. ఈ రోజు మీరు తోబుట్టువుల కోసం ధనం ఖర్చు చేస్తారు. అనవసర గందర గోళాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మొత్తం మిశ్రమ ఫలితాలతో కొనసాగుతుంది. ఉద్యోగస్తులు మీ కార్యాలయంలో కొత్త ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి.
రాళ్లపల్లి సరస్వతీదేవి