ఈ రోజు కొన్ని రాశుల వారికి కుటంబ బాధ్యతలు నెరవేరనున్నాయి. కొందరికి ప్రేమ వ్యహారాలు కలిసి వస్తాయి.
మేష రాశి (Aries)
ఈ రోజు మీరు మానసిక ఆందోళన ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనస్సులో తెలియని భయాలు వెంటాడుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. విద్యార్థులకి అనుకూలమైన సమయం. విద్యకు సంబంధించిన విషయాల్లో విజయాలు అందుకుంటారు. ఈ రోజు మీరు కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. ఈ రాశి స్త్రీ, పురుషులు ప్రేమలో ఉన్నట్లయితే అప్రమత్తంగా ఉండండి కొన్ని వివాదాలు తెలెత్తే అవకాశముంది. ఒకరి నుంచి ఒకరు ఏమి ఆశించకుండా ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది.
వృషభ రాశి ( Taurus)
ఈ రోజు ధార్మిక కార్య క్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలమైన రోజు. రాజకీయ వ్యవహారాలు సజావుగా పరిష్కారమవుతాయి. జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు అకస్మాత్తుగా కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి.
మిథున రాశి (Gemini)
ఈ రోజు మీకు ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఈ రోజు మీ మనస్సు విచారంగా ఉంటుంది. మీ స్నేహ సంబంధాలు బలపడతాయి. ఇతరుల సహకారం పొందడంలో విజయం సాధిస్తారు. మీరు మీ వివాహేతర సంబంధాన్ని ఆపకపోతే అది కుటుంబంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత లోపించి విభేదాలు ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి (Cancer)
మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తికావడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు ఈ రోజు సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రేమికులకు అనుకూలమైన రోజు. ఇద్దరి మధ్యా ఏమైనా విబేధాలు తలెత్తి దూరమైన వారు కూడా దగ్గరవుతారు. ఒకర్ని ఒకరు అర్థం చేసుకుని మీ బంధాన్ని నిలబెట్టుకోండి.
సింహ రాశి (Leo)
ఈ రాశి వారు ఈ రోజు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. నేత్ర సంబంధిత, లేదా ఉదర సంబంధిత రుగ్మతలు తలెత్తే అవకాశముంది. అశ్రద్ధ చేయకండి. రాజకీయ నేతలకి అనుకూలమైన సమయం. మీ చిరకాల వాంఛలు నెరవేరుతాయి. మేధోపరమైన చర్చల్లో మీ తార్కిక ఆలోచనలను అందించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది.
కన్యా రాశి (Virgo)
ఈ రోజు మీరు మీ ప్రియమైన వారి నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. అశ్రద్ధ చేయకండి. ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం, వ్యాపార పరంగా మీ ఖ్యాతి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవి పొందే అవకాశముంది. ఈ విషయంలో కింది అధికారుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు.
తులా రాశి (Libra)
ఈ రోజు మీరు మీ తెలివితేటలతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. ప్రేమికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనవసర పంతాలకు, పట్టింపులకు పోయి మీ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకండి. సంయమనం పాటించండి.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రోజు ఈ రాశి స్త్రీ పురుషులకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మీకు కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ రోజు మీరు సంతానం విషయంలో ఆందోళనని ఎదుర్కొంటారు. విద్యార్థులు కష్టపడి చదవాలి. అనవసర టెన్షన్ కి లోను కావొద్దు. మీ జీవిత భాగస్వామి మద్దతుతో, మీరు జీవితంలో ముందుకు సాగడానికి ఒక మార్గాన్ని ఎంచుకుంటారు.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రాశి వారు సంతానం కోసం ప్రయత్నిస్తుంటే అవి విజయవంతమవుతాయి. విద్యార్థులు చదువులో ముందుకు సాగుతారు.ఉన్నత విద్య కోసం కొనసాగుతున్న ప్రయత్నాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారస్తులకు మీ కొత్త ప్రణాళికలు కలిసి వస్తాయి. విజయవంతంగా ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.మౌలిక వసతులు, సౌకర్యాలు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల కోసం కొంత టైం కేటాయించండి.
మకర రాశి (Capricorn)
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభ దినం . మీరు చేసే సృజనాత్మక పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి మద్దతు, సాంగత్యం లభిస్తుంది. మీరు ఈ రోజు బహుమతులు, సన్మానాలు పొందుతారు. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలమైన రోజు. మీరు పాత విషయాల గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందకండి. ఈ రోజుని ఆస్వాదించండి.
కుంభ రాశి (Aquarius)
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభదినం. కుటుంబ ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తికావడంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎంత పెద్ద పని అయినా పిల్లల సహాయంతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
మీన రాశి ( Pisces)
ఈ రోజు రాశి వారికి కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. ప్రశాంతంగా హాయిగా ఉంటారు. మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆర్థిక ప్రణాళిక విజయవంతమవుతుంది. ఆర్ధిక పురోగతి ఉంటుంది. విద్యార్థులు అన్నిటా విజయం సాధిస్తారు. మీకిది అనుకూలమైన సమయం. ఉన్నత విద్యకోసం ప్రణాళికలు వేసుకోవచ్చు. ఈ రోజు మీ విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి, లేకపోతే వాటిని కోల్పోయే ప్రమాదముంది. ఈ రోజు మీరు కుటుంబ సమస్యలతో బాధపడతారు. ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగండి.
రాళ్లపల్లి సరస్వతీదేవి