మేష రాశి (Aries)
ఈ రోజు ఈ రాశి వారు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. సృష్టి, నిర్మాణం, పరిశోధన, మొదలైన రంగాల్లో ఉన్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్నిటిలో విజయం సాధిస్తారు. వ్యాపారరంగంలో ఉన్నవారికి నూతన ప్రణాళికలు విజయవంతమవుతాయి. ప్రేమికులకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
వృషభ రాశి ( Taurus)
ఈ రాశి వారికి ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. ఈ రోజు మీ సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. మీరు బహుమతులు, సన్మానాలు పొందుతారు. ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వివాహితులు జీవిత భాగస్వామితో ఆనందగా గడుపుతారు.
మిథున రాశి (Gemini)
ఈ రాశి స్త్రీ పురుషులు ఈ రోజు బహుమతులు, సన్మానాలు పొందుతారు. కుటుంబ, సామాజిక సంబంధాలు బలపడతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రణాళికలు వేసుకోవటానికి అనుకూలమైన రోజు. పెట్టుబడి, పొదుపు ప్రణాళికలు కూడా ఈ రోజు రూపొందిస్తారు.
కర్కాటక రాశి (Cancer)
మీరు చేసే వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మీ సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. బహుమతులు, సన్మానాలు అందుకుంటారు. మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తే అవకాశముంది. సంయమనం పాటించండి. ప్రేమికులకు కూడా కొన్ని విబేధాలు వచ్చే అవకాశముంది.
సింహ రాశి (Leo)
విద్యారంగంలో ఉన్న వారు ఊహించని విజయం సాధిస్తారు. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి సామాజిక సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు కుటుంబంతో ప్రేమగా గడుపుతారు. ఆహ్లాద వాతావరణాన్ని ఏర్పరుస్తారు. తండ్రి నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఆకస్మిక ఖర్చులకు ఆస్కారం ఉంది.
కన్యా రాశి (Virgo)
ఈ రాశి ఉద్యోగస్తులకు ఆఫీస్ లో మహిళా అధికారుల సహకారం లభిస్తుంది. ఈ రాశి స్త్రీలకూ ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీరు బహుమతులు, సన్మానాలు పొందుతారు. విద్యారంగంలో కొనసాగుతున్న వారు అద్భుత విజయాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ సహకారం కోసం ఉన్నతాధికారులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు. మిగతా విషయాల్లో మీకు కూడా వారు అన్ని విధాలుగా సహాయపడతారు.
తులా రాశి (Libra)
ఈ రాశి స్త్రీ పురుషులు ఈ రోజు తండ్రి లేదా మత గురువు నుంచి మద్దతు పొందుతారు. మీరు చేసే సృజనాత్మక పనుల్లో పురోగతి సాధిస్తారు. ఈ రోజు మీ సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ఈ రోజు ప్రేమికులకు అనువైన రోజు. విభేదాలు తొలగి అన్యోన్యంగా ఉంటారు. ఈ రోజు మీరు మీ భాగస్వామితో ఏకాంతంలో సరదాగా గడుపుతారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీకు ఏ మాత్రం ఆసక్తి లేని సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసర హడావిడి ఉంటుంది. ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రేమికులకు కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఈరోజు మీ స్నేహితులు మీ నుంచి దూరం కావడానికి ప్రయత్నిస్తారు.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రాశి స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం చేసేవారికి ఈ రోజు వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేసే సృజనాత్మక పనుల్లో పురోగతి సాధిస్తారు. ఈ రోజు మీరు ప్రయాణం చేసేటట్లు అయితే పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. వ్యాపారస్తులు ఈ రోజు రిస్క్ తీసుకున్నా కలిసివస్తుంది. ఎందుకంటే ఈ రోజు మీకు అనుకూలమైన రోజు.
మకర రాశి (Capricorn)
ఈ రాశి వారు ఈ రోజు వైవాహిక జీవితంలో ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అశ్రద్ధ చేయకండి, పరిస్థితులు తీవ్రంగా మారుతాయి. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వారు మీకు చెడు చేసే అవకాశముంది. మీకు ఈ రోజు బహుమతులు, సన్మానాలు పెరుగుతాయి. వ్యాపారం లేదా ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. వివాహిత దంపతుల జీవితంలో గందరగోళం ఏర్పడుతుంది. సంయమనం పాటించండి.
కుంభ రాశి (Aquarius)
ఈ రోజు మీ తెలివితేటలతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవనోపాధి రంగంలో మీకు పురోగతి ఉంటుంది. ఈ రోజు మీ సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రేమికులు ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండండి. అన్ని విషయాల్లో పారదర్శకంగా ఉండాలి.
మీన రాశి ( Pisces)
ఈ రోజు ఈ రాశి స్త్రీ పురుషులకు ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు తలెత్తి ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టండి. నిర్లక్షంగా వ్యవహరించకండి. జీవిత భాగస్వామి తో అన్యోన్యంగా గడుపుతారు. ప్రేమికులకు అనుకూల సమయం కానందున అప్రమత్తంగా ఉండండి. పొరపాట్లు చెయ్యకండి. చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.