తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నూతన పాలక మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. మీడియా సంస్థ అధినేత బొల్లినేని రాజగోపాల్ నాయుడు అధ్యక్షుడుగా 23 మంది సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటైంది. ఇందులో తెలంగాణ తరఫున ఐదుగురు నియమితులయ్యారు. ఇందులో తెలంగాణ తరఫున ఐదుగురు నియమితులయ్యారు. నన్నూరి నర్సిరెడ్డి, బొంగునూరి మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బూరగపు ఆనంద్ సాయి, సుచిత్ర ఎల్లా ఉన్నారు. APకి చెందిన ముగ్గురు MLAలకు చోటు దక్కగా.. అందులో జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ, కొవ్వూరు శాసనసభ్యుడు ప్రశాంతిరెడ్డి, మడకశిర MLA ఎం.ఎస్.రాజు ఉన్నారు.
బొంగునూరి మహేందర్ రెడ్డి జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తుండగా, APతో వ్యాపార, వాణిజ్య సంబంధాలున్నాయి. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు నుంచి పవన్ కల్యాణ్ తో ప్రయాణిస్తున్నారు. జనసేన వ్యవస్థాపక సభ్యురాలైన రంగశ్రీ కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ రూపకర్తగా పరిచితులు. శ్రీకాకుళానికి చెందిన ఆనంద్ సాయి చెన్నైలో ఉన్నప్పట్నుంచి జనసేన చీఫ్ తో అనుబంధముంది.