తిరుమలలో రెండ్రోజుల పాటు VIP దర్శనాలకు TTD బ్రేక్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో ఈనెల(జులై) 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న ఆణివార ఆస్థానం వేడుకలు ఉంటాయి. ఆ పర్వదినాల వేళ VIP బ్రేక్ దర్శనాలు ఉండవని TTD స్పష్టం చేసింది. 14, 15 తేదీల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా VIP బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలు స్వీకరించబోమని ప్రకటించింది.