మీ డబ్బులను ఇలా లెక్కిస్తున్నారా? పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు.. లక్ష్మీదేవి శపిస్తుందట!
Manifest Money Tips : డబ్బులను లెక్కించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు(Businessmen) చాలామంది రోజుకు కొన్ని వేల సంఖ్యలో డబ్బులను లెక్కిస్తుంటారు. అయితే, కరెన్సీ(Currency) డబ్బులను ఎలాపడితే అలా లెక్కించడం వాస్తుపరంగా మంచిది కాదు. చాలామందికి లెక్కించే విధానం తెలియకపోవడం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. అసలు డబ్బులను ఎలా లెక్కించాలి? ఎలా లెక్కించకూడదు? డబ్బులను ఏ ప్రదేశంలో పెట్టాలి? ఎక్కడ పెట్టకూడదని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం..
డబ్బుల విషయంలో పొరపాట్లు చేయొద్దు :
పురాణాల్లో లక్ష్మీదేవి(Lakshmi Devi)ని ఐశ్వర్యానికి ప్రతీకగా సూచిస్తారు. అలాంటి డబ్బులను లెక్కించేటప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు(Mistakes) చేయకూడదు. లేదంటే మీరు సంపాదించిన మొత్తం ఆస్తులు ఆవిరయ్యే ప్రమాదం ఉంది. కొందరు నగదును లెక్కిస్తూ కొన్ని పొరపాట్లు చేస్తారు. డబ్బులను లెక్కపెట్టేవారు.. నాలుకతో వేలిని తడిమి లెక్కిస్తుంటారు. వాస్తు ప్రకారం.. ఇలా అసలు చేయకూడదు. లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పిస్తుందట. కరెన్సీ కాగితాలను ఎప్పుడు ఎంగిలి చేయకూడదు. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయట.. నోట్లను లెక్కించేటప్పుడు గ్లాసులో నీటితో వేలిని తడిమి డబ్బులను లెక్కించవచ్చు.
పర్సులో డబ్బు తప్ప ఏమి పెట్టొద్దు :
లక్ష్మీదేవి అంటే.. డబ్బుగా భావిస్తారు. పైసలు ఎక్కడ ఉంటే అది లక్ష్మీదేవి నివాసంగా చెబుతారు. డబ్బులను ప్రత్యేకమైన స్థానాల్లో మాత్రమే పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం.. డబ్బులు పర్సులో పెట్టుకోవచ్చు. కానీ పర్సులో ఇతర వస్తువులు అసలు పెట్టకూడదు. పొరపాటున కూడా ఇలా చేయకూడదు. డబ్బు విషయంలో ఎట్టిపరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు. నగదు విలువ తెలియక ఎక్కడపడితే అక్కడ పెట్టేస్తుంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంటారు. డబ్బు ఉంటే కొద్దిగా మీ పర్సులో పెట్టుకోవచ్చు. మిగిలిన డబ్బును బీరువాలో ఉంచుకోవచ్చు. అలా అని వంటగదిలోని పాత్రల్లో డబ్బాల్లో పెట్టకూడదు. బయటకు వెళ్లిన సమయంలో ఎవరైనా యాచకులు కనిపిస్తే డబ్బులను ఎలాపడితే అలా ఇవ్వకూడదు.
డబ్బులను బెడ్‌పై ఉంచకూడదు :
మీ చేతులతో స్వయంగా వారికి అందించాలి. అంతేకానీ, నిర్లక్ష్యంగా డబ్బులను వారిపై విసరకూడదు. ఇలా చేస్తే లక్ష్మిదేవీకి కోపం వచ్చి మీ దగ్గర నుంచి వెళ్లిపోతుందని అంటారు. ఇంట్లో నిలబడాలంటే.. రాత్రి వేళలో డబ్బులను బెడ్‌పై ఉంచకూడదు. డబ్బులను కేవలం పరిశుభ్రమైన ప్రదేశంలోనే పెట్టాలి. చేతిలో డబ్బులు లెక్కిస్తున్న సమయంలో డబ్బులు జారిపడిపోతే వెంటనే తీసుకుని కళ్లకు అద్దుకోవాలి. ఎందుకంటే పైసల్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లేదంటే.. మీ సంపాదన ఎంత వచ్చినా వచ్చినట్టే నీళ్లలా వృథా అయిపోతుందని వాస్తుశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సమాచారం కేవలం వారి వారి వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. ఇలాంటి వాటికి శాస్త్రీయం(Scientifical)గా ఎటువంటి ఆధారాలు లేవని గమనించాలి.