
పెళ్లి కుదిరిందంటే.. ఆహార నియమాలు లేదా జిమ్ కు వెళ్లి సన్నగా అయ్యేవారు. కానీ మెట్రో నగరాల్లో ‘మౌంజారో బ్రైడ్స్’ అనే కొత్త ట్రెండ్ బయటపడింది. నాజూకు కోసం GLP-1 డ్రగ్స్ ను ఇంజెక్షన్ల ద్వారా తీసుకుంటున్నారు. కొన్ని క్లినిక్ లు బహిరంగంగా, మరికొన్ని రహస్యంగా ‘బ్రైడల్ వెయిట్ లాస్’ ప్యాకేజీలు ఇస్తున్నాయి. వారానికి రూ.1,500-2,000.. కోర్సు పూర్తయ్యేసరికి రూ.50 వేలు ఖర్చవుతోంది. ఆకలిని నియంత్రించే ఈ మందును డయాబెటిస్ రోగులకు ఇస్తారు. జీర్ణవ్యవస్థలో ఆహారం ఎక్కువసేపు ఉండేలా చేసి కడుపు నిండుగా ఉందన్న భావనను ఇంజెక్షన్లు కల్పిస్తాయి. ఈ మందు వల్ల వాంతులు, కడుపు ఉబ్బరం, జీర్ణకోశ సమస్యలు తలెత్తే ప్రమాదముంది. మోతాదు తగ్గినా, శృతిమించినా ప్రాణాలు పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.