ఆహారం మన శరీరానికి ఇంధనంగా పనిచేస్తుంది. రోజుకు 3 సార్లు సమతుల్య భోజనం మంచిదని నిపుణులంటున్నారు. ఏమి తింటారనే కాదు, తిన్న తర్వాత ఏం చేస్తారనేదీ ముఖ్యమే. భోజనమయ్యాక పోషకాల్ని గ్రహించడానికి శరీరం ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంటుంది. ఆ టైంలో ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్ ను పలుచన చేస్తుంది. వెంటనే పడుకోవడం యాసిడ్ రిఫ్లెక్స్ కు దారితీస్తుంది. టీ లేదా కాఫీ తాగడం జీర్ణక్రియకు హాని చేస్తుంది. టీ, కాఫీలోని టానిన్లు(Tanins) ఐరన్ ను తీసేసుకుంటాయి. అవి ఆమ్లత్వ స్థాయిని పెంచి కడుపు ఉబ్బరమై జీర్ణక్రియ మందగిస్తుంది. ఎక్కువ నీటి వల్ల ఆమ్లాలు, జీర్ణ ఎంజైమ్ లు పలుచనవుతాయి. ఆహార పైపును క్లియర్ చేయడానికి కొంచెం నీరు మాత్రమే అవసరం. తిన్న వెంటనే పండ్లు తీసుకోవడమూ లాభం లేని పనే. విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెట్లుండే ఫలాల(Fruits) వల్ల ఉబ్బరానికి దారితీస్తుంది.
తిన్నాక దేనికి ఎంత టైం తీసుకోవాలంటే…
@ పూర్తి గ్లాసు నీరు తాగడానికి 30 నిమిషాలుండాలి
@ పండ్లను భోజనానికి 30 నిమిషాల ముందు.. లేదా 2 గంటల తర్వాత
@ తేలికపాటి నడకే తప్ప గంట పాటు వ్యాయామాలు ఉండొద్దు.
@ నిద్ర కోసం కనీసం 2 గంటలు వేచి ఉండాల్సిందే.