వానాకాలం వస్తే చాలు… రకరకాల వ్యాధులు ఇబ్బంది పెడతాయి. వర్షాలతో వెదర్ ఒక్కసారిగా మారిపోవడం వల్ల శరీరంలో మార్పులు కలుగుతాయి. ముఖ్యంగా జ్వరాలు జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాంటి సందర్భాలు ఎదురుకాకముందే ప్రికాషన్స్ తీసుకోవాలంటారు డాక్టర్లు. వానలతో దోమల సంతతి బాగా పెరుగుతుంది. మన ఇల్లు శుభ్రంగా ఉన్నా పరిసరాలు నీట్ గా లేకుంటే దోమలు పెరగడానికి కారణంగా నిలుస్తాయి. అందుకే పిల్లలు, వృద్ధులపై ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది కాబట్టి… దోమలకు అడ్డుకట్ట వేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
కాగబెట్టిన నీళ్లే మంచిది
ఈ సీజన్ లో కాగబెట్టి చల్లార్చిన నీళ్లు తాగితేనే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. తరచుగా జర్నీ చేస్తున్న సమయంలో ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగుతాం.. హోటళ్లలో తినాల్సిన పరిస్థితి వస్తుంది.. అలా కొన్నిచోట్ల తాగిన కలుషిత నీటితో టైఫాయిడ్, కలరా వంటి డిసీజెస్ రావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు కాచిన నీళ్లు చల్లార్చి వెంట తీసుకెళ్లడం మంచిదంటున్నారు.
తీసుకునే ఫుడ్ బాగుండాలి
సీజనల్ డిసీజెస్ ఎదుర్కొనేవాళ్లు ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. వెజ్ టేరియన్స్ వ్యక్తులు ఎక్కువగా పప్పు ధాన్యాలు… నాన్ వెజ్ టేరియన్స్ రెగ్యులర్ గా ఎగ్స్ తీసుకోవాలని చెబుతున్నారు. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెంచుకునే అవకాశముంది. అయితే ఫ్రిజ్ లో ఉన్న ఐటెమ్స్ తీసుకోవద్దంటున్నారు.