దగ్గు(Cough), జలుబు, జ్వరం(Fever) ఏదొచ్చినా చాలు.. చిన్న జబ్బుకే పెద్ద మందు అన్నట్లు యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడుతూ ఉంటారు. ఇలా ఇష్టమొచ్చినట్లు వాడటం ప్రాణాలకే ప్రమాదకరమని పరిశోధనలో తేలింది. ఇలా 1990-2001 కాలంలో 10 లక్షల(మిలియన్) మంది మృత్యువాత పడ్డట్లు గ్లోబల్ రీసెర్చ్ ఆన్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్(GRAM) పరిశోధనలో తేలింది. వచ్చే 25 ఏళ్లల్లో మరణాల సంఖ్య 3.90 కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది.
యాంటీబయాటిక్స్ తో దక్షిణాసియా(South Asia)లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని, 2025-2050 కాలంలో 1.18 కోట్ల మంది మరణించవచ్చని తెలిపింది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల్లో ప్రభావం ఎక్కువగా ఉండనుంది. యాంటీబయాటిక్, యాంటీ మైక్రోబయల్, రెసిస్టెన్స్ అంటే ఇన్ఫెక్షియస్ బాక్టీరియాతోపాటు శిలీంధ్రాలను చంపడానికి తయారైన మందులు ఎందుకూ పనికిరాని విధంగా తయారవుతాయి. తద్వారా రెసిస్టెన్స్ పవర్ కోల్పోయి ప్రాణాలు కోల్పోతున్నారని రిపోర్ట్ తెలిపింది.