ఈ సంవత్సరం మరో 60 వైద్య(Medical) కళాశాలలు(Colleges) ఏర్పాటు చేస్తామని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా తెలిపారు. మోదీ మూడో దఫా 100 రోజుల పాలనలో భాగంగా తీసుకువస్తున్న కాలేజీలతో… వాటి సంఖ్య 8.07% పెరుగుతుందన్నారు. 2013-14లో 387 కాలేజీలు ఉంటే 2024-25 నాటికి 766కు పెరిగి రెండింతలవుతుంది. ఇందులో 423 ప్రభుత్వ, 343 ప్రైవేటు నిర్వహణలో ఉన్నాయి.
6.30%తో MBBS సీట్లు గతేడాది కన్నా ఈసారి 7 వేల దాకా పెరుగుతాయని నడ్డా తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు సైతం 5.92 శాతం పెరుగుదలతో 69,024 నుంచి 73,111 చేరుకోనున్నాయి.