ఆరోగ్య బీమా(Healt Insurance)ల ప్రీమియం ఏటా భారీగా పెరుగుతోంది. దాన్ని భరించలేక చాలామంది ఇన్సూరెన్స్ కు దూరమవుతున్నారు. క్లెయిమ్స్ తో హాస్పిటల్స్ పెద్దయెత్తున దోచుకుంటున్నాయని గుర్తించిన కేంద్రం.. వాటికి చెక్ పెట్టబోతోంది. క్లెయిమ్ ల కోసం పోర్టల్ తీసుకురావాలన్న ఆలోచనతో ఉంది. దేశంలో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు ఇప్పటిదాకా 12 శాతంగా ఉంటే, 2025లో 13 శాతానికి చేరుకుంటాయని అంచనా. ప్రపంచ సగటు 10% మాత్రమే. ఆస్పత్రులు రోగుల ఖర్చులు పెంచడం వల్లే బీమా సంస్థలు ప్రీమియం పెంచుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, IRDAI.. క్లెయిమ్స్ రేట్లను నిర్ణయించబోతున్నాయి. 2023-24లో హెల్త్ ఇన్సూరెన్స్ ఆదాయం 20%గా ఉంటే.. 2024-25లో 9%నికి పడిపోయింది. https://justpostnews.com