వాయు కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో అంతకంతకూ పెరుగుతూ శ్వాస ఆడకుండా చేస్తున్న పొల్యూషన్ ను అరికట్టేందుకు వాహనాల(Vehicles)పై నిషేధం విధించింది. అత్యవసర చర్యలకు ఆదేశిస్తూ ప్రత్యేక ఆంక్షలు ప్రకటించింది. అత్యవసర వాహనాలు(Emergency Vehicles) తప్ప ఇతర వాహనాలకు ఢిల్లీలోకి పర్మిషన్ లేదని తేల్చి చెప్పింది. లారీలు, ఇతర వాణిజ్య వాహనాల్ని ఎట్టిపరిస్థితుల్లో క్యాపిటల్ రీజియన్ లోకి అనుమతివ్వబోమని స్పష్టం చేసింది. BS-6, CNG, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను మాత్రమే అనుమతించడంతోపాటు అన్ని రకాల నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధాన్ని అమలు చేస్తున్నది.
కాలుష్య నియంత్రణకు అన్ని రకాల అత్యవసర చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఢిల్లీ చుట్టూ ఉన్న రాష్ట్రాలు సైతం ఇదే విధానాన్ని అమలు చేయాలని కోరింది. అటు ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో సగం మంది(50 శాతం)తోనే పని చేయించాలని, మిగతా వారంతా ఇంటి నుంచే(Work From Home) ఉండేలా చూడాలని ఆదేశాలిచ్చింది.