మనిషి ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ఉపకరిస్తుందో మెట్లు ఎక్కడం అంతకన్నా మేలు చేస్తుందని తాజా అధ్యయనం(Research) తెలిపింది. ఫిట్నెస్ పెంపు, కేలరీల్ని బర్న్ చేయడానికి మెట్లెక్కడం శ్రేయస్కరమని తేలింది. లిఫ్టులు కాకుండా తోటివారితో కలిసి మెట్లెక్కితే ఎంతో మేలట. అసోసియేటెడ్ ప్రెస్ రీసెర్చ్ ప్రకారం.. ఒక కిలో శరీర బరువు సాధారణ నడకతో 0.5 కేలరీలు తీసుకుంటే, నిలువు కదలికతో 10 కేలరీలు ఖర్చవుతాయి. అంటే 20 రెట్లు ఎక్కువన్నమాట. మనిషి బరువును బట్టి దీన్ని లెక్కించవచ్చు. మెట్లు దిగడం కూడా చదునైన ఉపరితలంపై నడక కన్నా 5 రెట్లు ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. https://justpostnews.com
శరీర కూర్పు, బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇన్సులిన్ సహా కీలక కార్డియో-మెటబాలిక్ ప్రమాద కారకాలను మెరుగు పరుస్తుందని బ్రిటన్ లో 4.5 లక్షల మందిపై చేసిన రీసెర్చిలో తేలింది. రోజుకు 5 మెట్లెక్కితే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 20% తగ్గిస్తుందని తేలింది. డ్యూక్ వర్సిటీ గైడెన్స్ ప్రకారం రోజుకు రెండు మెట్లెక్కినా ఏటా 2.7 కిలోలు తగ్గొచ్చు.