Control Blood Sugar : మీరు చాలా కాలంగా డయాబెటిస్(Diabetes)తో బాధపడుతున్నారా. ఎన్ని మెడిసిన్స్ లేదా ట్రీట్మెంట్ తీసుకున్నా ఫలితం లేదని తెలిసి విసిగిపోయారా? అయితే, సహజసిద్ధమైన(Natural) పద్ధతుల ద్వారా డయాబెటిస్ ఎలా తగ్గించుకోవాలో తెలుసా? సాధారణంగా షుగర్ తగ్గించడంలో అనేక కూరగాయలు, వంట దినుషులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా వీటిని తయారు చేసుకుని తీసుకోవచ్చు. కొద్దిరోజుల పాటు వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా డయాబెటిస్ 150 ఉన్నప్పటికీ తొందరగా నార్మల్కు వచ్చేస్తుంది.
కాకరకాయ అద్భుత ఔషధం :
మధుమేహాన్ని తగ్గించడంలో కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కాకరకాయ ఒక్క మధుమేహ వ్యాధిగ్రస్తుల(Patients)కు ఒక వరం. ఎన్నో ఔషధ గుణాలున్న కాకరలో కెరోటిన్ ఉంటుంది. అందువల్ల కాకరను తరచూ తినడం వల్ల రక్తశుద్ధి(Blood Purification) జరుగుతుంది. హైపర్ టెన్షన్ vg కూడా అదుపులో ఉంచుతుంది. అధిక మొత్తంలో పీచు లభించడం ద్వారా సొరియాసిస్ నివారణలో కాకర అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో శరీరానికి.. పోషకాలైన ఫోలేట్ మెగ్నీషియం, పొటాషియం, జింక్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి జీర్ణశక్తిని వృద్ధి చేయడంతోపాటు ఈ కాకరను కాయగా లేదా జ్యూస్ నీళ్ల మాదిరిగా తయారు చేసుకుని వాడుకోవచ్చు.
మెంతులతో షుగర్‌కు చెక్ :
ఇక డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మెంతులు చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రెండు స్పూన్ల మెంతులు తీసుకుని ఒక బౌల్లో వేయాలి. అందులో కొద్దిగా నీరు పోసి రాత్రంతా నిల్వ ఉంచాలి. మరుసటి రోజు ఆ నీటిని ఒక గ్లాసులోకి వడకట్టి తాగాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.
షుగర్ లెవల్స్ తగ్గించే దాల్చిన చెక్క :
దాల్చిన చెక్క గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బ్లడ్ లెవెల్స్ తగ్గించడంలో అద్భుతంగా సాయపడుతుంది. దాల్చిన చెక్కను కూరల్లో టేస్ట్ కోసం వాడుతారు. కొంతమంది దీన్ని టీ చేసుకుని తాగితే మంచిదని అంటారు. ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో దాల్చిన చెక్క వేసి పది నిమిషాలు మరిగించాలి. ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత దాల్చిన చెక్క నీళ్లను వడపోయాలి. ఈ నీటిని పరగడుపున రోజు తాగితే మధుమేహం తొందరగా అదుపులోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తులసి ఆకులతో షుగర్ మాయం :
ఆయుర్వేదంలో తులసి ఆకులు దివ్యౌషధంగా చెప్పవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి యాంటీఆక్సిడెంట్ గుణాల వల్ల బ్లడ్ షుగర్ తగ్గించగలవు. తులసీ ఆకులతో రసం తయారు చేసుకుని తాగడం ద్వారా షుగర్ లెవల్స్ వెంటనే అదుపులోకి వస్తాయి. కొన్ని నీళ్లలో తులసి ఆకుల్ని వేసి బాగా మరిగించిన తరువాత ఆ నీటిని వడగట్టి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
పైన పేర్కొన్న ఆరోగ్య చిట్కాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ, బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులోకి రాకపోతే వెంటనే మీ దగ్గరలోని వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.
Published 11 Feb 2024