కరోనా(Corona) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో వారంలోనే 99 మందిలో లక్షణాలు బయటపడగా, ప్రస్తుతానికి దేశంలో 1,009 పాజిటివ్ కేసులున్నాయి. కేరళలో అత్యధికంగా 430 ఉంటే, రెండో స్థానంలో 209 కేసులతో మహారాష్ట్ర నిలిచింది. ఢిల్లీ-104, గుజరాత్-83, కర్ణాటక-47, ఉత్తరప్రదేశ్-15, పశ్చిమబెంగాల్-12 చొప్పున కేసులు రికార్డయ్యాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో నలుగురు, కేరళ వాసులు ఇద్దరు, కర్ణాటకకు చెందిన ఒకరు మృతిచెందారు. అండమాన్, అరుణాచల్, అసోం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ లో మాత్రమే యాక్టివ్ కేసులు లేవు.