Published 21 Dec 2023
కొవిడ్ కేసులు దేశంలో అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 594 కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరుకుంది. మొత్తంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా అందులో కేరళ నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, పంజాబ్ లో ఒక్కరు ఉన్నారు.
కర్ణాటక హై లెవెల్ మీటింగ్
కర్ణాటకలో ప్రమాదకరంగా మారతున్న కొవిడ్-19పై సిద్ధరామయ్య సర్కారు హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. డిప్యుటీ CM సిద్ధరామయ్య, హెల్త్ మినిస్టర్ దినేశ్ గుండూరావుతోపాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 100 దాటగా, బెంగళూరులో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.