Dandruff In Winters : ప్రస్తుత రోజుల్లో చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. జుట్టుపై పొడిగా లేదా జిడ్డుగా మారినప్పుడు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. చలికాలంలో చుండ్రుని ఎదుర్కొనేందుకు అనేక ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. చల్లని ఉష్ణోగ్రతలు జుట్టు కింది రక్తనాళాలను సంకోచించేలా చేస్తాయి. చర్మానికి నూనె(Oil), తేమ సరఫరాను తగ్గిస్తుంది. పొడిబారడం(Dry)తో జుట్టు ఉపరితలంపై పొట్టులా పేరుకుపోతుంది. సూర్యరశ్మికి గురికావడం వల్ల చుండ్రుతో ఒక రకమైన ఫంగస్ ఏర్పడుతుంది. శీతాకాలంలో తగ్గిన సూర్యకాంతి కారణంగా ఈ ఫంగస్ పెరుగుదలకు దారితీస్తుంది. చలికాలంలో చుండ్రును తగ్గించుకోవడానికి అనేక అద్భుతమైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.
శీతాకాలంలో చుండ్రుని తగ్గించడంలో సాయపడే కొన్ని చిట్కాలు మీకోసం..
1. టీ ట్రీ ఆయిల్ :
టీ ట్రీ ఆయిల్లో యాంటీ ఫంగల్(Anti Fungal) గుణాలు ఉన్నాయి. చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను తగ్గించడంలో సాయపడుతుంది. కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్(Olive Oil) వంటి క్యారియర్ ఆయిల్‌తో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి మీ తలకు రాయండి. తేలికపాటి షాంపూతో కడిగే ముందు సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచండి.
2. ఆపిల్ సైడర్ వెనిగర్ :
ఆపిల్ సైడర్ వెనిగర్ స్కాల్ప్ (pH)ని సమతుల్యం చేయడంలో సాయపడుతుంది. చుండ్రుకు దోహదపడే ఈస్ట్ పెరుగుదలను తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ నీటిని సమాన భాగాలుగా కలపండి. మీ తలకు అప్లై చేయండి. కడిగే ముందు 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. వారానికి రెండుసార్లు(Weekly Twice) రిపీట్ చేయండి.
3. కలబంద :
కలబందలో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. చుండ్రు వల్ల కలిగే దురద, పొట్టును తగ్గించగలవు. ఆకుల నుంచి అలోవెరా జెల్(AleoVera Gel)ని తీసి తలకు పట్టించాలి. 30 నిమిషాల నుంచి గంటవరకు అలాగే ఉంచి సున్నితమైన షాంపూతో కడగాలి.
4. బేకింగ్ సోడా :
బేకింగ్ సోడా ఎక్స్‌ఫోలియెంట్‌గా పనిచేసి మృత చర్మ కణాలను తొలగిస్తుంది. చుండ్రును తొందరగా తగ్గిస్తుంది. మీ జుట్టు(Hair)ను తడిపి బేకింగ్ సోడాను మీ తలపై రుద్దండి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత పూర్తిగా శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు.
5. కొబ్బరి నూనె :
కొబ్బరి నూనె(Coconut Oil).. స్కాల్ప్‌ను తేమగా చేస్తుంది. పొడిబారడాన్ని తగ్గిస్తూ ఈస్ట్ పెరుగుదలను నివారిస్తుంది. చివరికి చుండ్రును తగ్గిస్తుంది. కొంచెం కొబ్బరి నూనెను వేడి చేసి మీ తలకు మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం మీ జుట్టును కడగాలి. ఇలా వారానికి కొన్ని సార్లు రిపీట్ చేయండి.
6. వేప నూనె :
వేప నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్(Anti Bacterial) లక్షణాలు ఉన్నాయి. చుండ్రు కలిగించే శిలీంధ్రాలను ఎదుర్కోగలవు. కొన్ని చుక్కల వేప నూనెను క్యారియర్ ఆయిల్‌తో కలపండి. మీ తలపై మసాజ్ చేయండి. తేలికపాటి షాంపూతో కడిగే ముందు 30 నిమిషాల నుంచి గంట వరకు అలాగే ఉంచండి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించండి.
7. సాలిసిలిక్ యాసిడ్ ఆధారిత షాంపూలు :
సాలిసిలిక్ యాసిడ్ స్కాల్ప్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. మృత చర్మ కణాలను తొలగిస్తుంది. సాలిసిలిక్ యాసిడ్ ఉన్న షాంపూలను మాత్రమే వాడండి. ఆరోగ్యనిపుణుల సూచనల ప్రకారం.. తేలికైనా షాంపూలను మాత్రమే ఉపయోగిస్తూ వారానికి 2-3 సార్లు ఉపయోగించండి.
పైన సూచించిన విధంగా రెమెడీ(Remedies)లు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలా అని మోతాకు మించి వీటిని వాడటం జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. అధిక వినియోగాన్ని నివారించండి. ఎందుకంటే తలపై చికాకు కలిగిస్తుంది. ఈ నివారణలను ప్రయత్నించినప్పటికీ చుండ్రు తగ్గకపోతే.. చికిత్స కోసం చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.