కంటి అద్దాలు(Glasses) అవసరం లేదంటూ ప్రచారం నిర్వహించిన ‘ఐ డ్రాప్స్’ కంపెనీపై కేంద్రం చర్యలు తీసుకుంది. కంటి చుక్కల మందు(Eye Drops)కు ఇచ్చిన లైసెన్సును DCGI(డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) సస్పెండ్ చేసింది. చూపు దగ్గరగా లేని(Presbiopia) వారికి రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తగ్గిస్తుందంటూ ప్రచారం చేశారు. అయితే అనధికారిక ప్రచారం చేసినందుకు ఐ డ్రాప్ తయారీదారులైన ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ పై చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
అనుమతి లేని ఔషధ ఉత్పత్తి కోసం క్లెయిమ్ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న DCGI.. నియమాల్ని సదరు కంపెనీ ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. అయితే DCGI విధించిన నిషేధంపై న్యాయపోరాటం చేస్తామని ఐ డ్రాప్స్ కంపెనీ తెలిపింది. తాము 234 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, చూపు స్పష్టంగా లేని రోగులపై మందు సక్సెస్ అయిందన్న కంపెనీ.. కళ్లద్దాలు లేకుండానే చూడగలుగుతున్నారని క్లారిటీ ఇచ్చింది.