డెంగ్యూ(Dengue), చికెన్ గున్యా, మలేరియాతో జనం అల్లాడుతున్నారు. రోగుల(Patients)తో హాస్పిటళ్లు కిటకిటలాడుతున్నాయి. పేదలు పెద్దాసుపత్రుల్లోకి వెళ్లే పరిస్థితి లేక సర్కారీ దవాఖానా(Hospital)నే నమ్ముకోవడంతో కేసుల సంఖ్య భారీగా ఉంటున్నది. అందరికీ వైద్యం అందించాలంటూ ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
జనవరి నుంచి ఇప్పటివరకు లక్షా 6 వేల 356 మందికి పరీక్షలు చేస్తే అందులో 6% మేర 6,242 మందిలో డెంగ్యూ తేలింది. హైదరాబాద్(2,073), సూర్యాపేట(506), మేడ్చల్ మల్కాజిగిరి(475), ఖమ్మం(407), నిజామాబాద్(362), నల్గొండ(351), రంగారెడ్డి(260), జగిత్యాల(209), సంగారెడ్డి(198), వరంగల్(128) జిల్లాలు టాప్-10లో ఉన్నట్లు వైద్యశాఖ ప్రకటించింది.
చికెన్ గున్యా కేసులు 167 అయితే హైదరాబాద్(74), మహబూబ్ననగర్(20), వనపర్తి(17), రంగారెడ్డి(16), మేడ్చల్(11) జిల్లాలు టాప్-5లో ఉన్నాయి. ఇక మలేరియా కేసులు 197 కాగా… గత 8 నెలల కాలంలో మొత్తం జ్వర కేసులు 2,99,708గా ఉన్నాయి.