డాక్టర్లను దేవుళ్ల(Goddess)తో సమానంగా భావిస్తారు. కొన్నిసార్లయితే కనిపించని భగవంతుని కన్నా కనిపించే వైద్యుణ్నే(Doctor) దేవుడనుకుంటారు. పునర్జన్మ ప్రసాదించే గౌరవప్రద వృత్తిలో ఉన్న కొందరు డాక్టర్లు పెడధోరణులకు అలవాటు పడుతున్నారు. ఈమధ్య వెలుగుచూసిన కొన్ని ఘటనలు వైద్య వృత్తి(Profession)నే అపహాస్యం చేసేలా ఉన్నాయి.
బదిలీల గోల…
బోధనాసుపత్రుల్లోని డాక్టర్ల బదిలీలు(Transfers).. సంఘాల మధ్య గొడవను పెంచాయి. రాష్ట్రానికి నిలయమైన DME ఆఫీసులోనే దాడి జరగడం కలకలం రేపింది. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(TGGDA) ప్రతినిధులు దాడి చేసినట్లు నాగర్ కర్నూల్ డాక్టర్ వి.శేఖర్ హైదరాబాద్ సుల్తాన్ బజార్ PSలో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ బోధనాసుపత్రులు, ఇతర జిల్లాల్లోని డాక్టర్ల మధ్య చాలాకాలం నుంచి వివాదం ఉంది. రాజధానికి రాకుండా ట్రాన్స్ ఫర్లు అడ్డుకుంటున్నారని జిల్లాల డాక్టర్ల వాదన. సరిగ్గా ఇదే మూమెంట్లో DMEని కలిసేందుకు వెళ్తున్న టైంలో ఎదురుపడ్డ రెండు వర్గాలు బాహాబాహీ(Fighting)కి దిగాయి.
జూడాల్లో కొందరు…
ఇంకో దారుణమైన వార్త కూడా మీడియాలో హల్చల్ చేసింది. అదేంటంటే.. కోఠిలో గంజాయి అమ్ముతుండగా ఒక పాత నేరస్థుణ్ని నార్కోటిక్స్-సుల్తాన్ బజార్ పోలీసులు పట్టుకున్నారని. దొరికిన పెడ్లర్ సురేశ్ సింగ్ పై 5 కేసులుండగా.. ఇద్దరు జూనియర్ డాక్టర్లు గంజాయి కొంటున్న సమయంలో పట్టుబడ్డారు. వారి నుంచి 80 గ్రాముల గంజాయి, 2 మొబైల్స్ సీజ్ చేశారు. జూడాలకు టెస్టులు చేస్తే పాజిటివ్ రావడంతో కేసు ఫైల్ చేసి ఇద్దర్నీ రిమాండ్ కు పంపించారు.
మొన్న కూడా…
జూడాల సమ్మె విషయంలోనూ గొడవలు కనిపించాయి. గాంధీ-ఉస్మానియా-ఇతర జూడాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒకరు సమ్మె విరమిస్తామంటే మరో వర్గం కొనసాగిస్తున్నామంటూ ఆరోపణలు చేసుకున్నాయి.
ఇలా ఈమధ్య చూస్తున్న పరిణామాలు వైద్య వృత్తికే కళంకంగా మారాయి. కొందరి తప్పుదోవ మొత్తంగా డాక్టర్లనే అనుమానంగా చూసేలా తయారైంది. మీకు ఎవరూ చెప్పే స్థాయిలో మీరుండరు డాక్టర్లారా… పది మందికి చెప్పే మీరే పెడదోవ పట్టకుండా మీ పని మీరు సక్రమంగా చేస్తే సమాజానికి ఎంతో మేలవుతుంది.