కొన్ని రోజులుగా వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి. దీంతో కొత్త నీటి రాకతో డిసీజెస్(Diseases) పెరిగే అవకాశాలు ఎక్కువయ్యాయి. కొన్ని సీజన్లు ప్రజల ప్రాణాలతో ఆటలాడుతుండగా… వర్షాకాల సీజన్ అందులో మెయిన్ రోల్ పోషిస్తోంది. ఎక్కడికక్కడ నీటి నిల్వ వల్ల జ్వరాలు పెరిగి పేషెంట్లతో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ముప్పు తప్పదని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు. సీజనల్ వ్యాధులకు ప్రధాన కారణం పరిశుభ్రత లేకపోవడం, దోమలేనని చెబుతున్నారు. మంచినీరు, ఈగలు కూడా ఇందుకు రీజన్ గా నిలుస్తున్నాయంటున్నారు. తినే ఆహారంలో నీట్ నెస్ లేకపోతే టైఫాయిడ్, కామెర్ల వ్యాధులు రాగా.. దోమలతో మలేరియా, డెంగ్యూ.. ఈగలతో ఇతర అంటు వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి.
వరుస వర్షాల వల్ల మురికి, చెత్తాచెదారం పేరుకుపోవడంతో చాలా ప్రాంతాల్లో డిసీజెస్ మొదలయ్యాయి. కూలర్లు, టైర్లు, కొబ్బరి బొండాలు, మూతలేని నీళ్ల ట్యాంకుల ద్వారా దోమలు పెరుగుతాయి. ఎడిస్ ఈజిప్టై దోమకాటుతో మలేరియా, పైలేరియా, మెదడు వాపు, డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులకు అవకాశం ఉంది. వైరల్ ఫీవర్లు రకరకాల సిమ్టమ్స్ తో వెలుగులోకి వస్తాయి. బాడీ పెయిన్స్, తలనొప్పి, దగ్గు, జలుబు వంటి సిమ్టమ్స్ ద్వారా వైరల్ ఫీవర్స్ బయటపడతాయి. వైరల్ ఫీవర్ బాడీలో 3 నుంచి 7 రోజులు ఉంటుంది.
వారంలో ఒకరోజు డ్రై డే(Dry Day)గా పాటించి పరిశుభ్రత కోసం దోమల మందు వాడాలని చెబుతున్నారు. వర్షాకాల ప్రారంభంలో ఏటా డెంగ్యూ కేసులు రికార్డవుతుంటాయి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సీజనల్ డిసీజెస్ పట్ల రూరల్ ఏరియాల్లో పెద్దగా అవగాహన ఉండకపోవడం కూడా రోగాలు పెరగడానికి కారణమవుతున్నది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు చేపట్టేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత హెల్త్ డిపార్ట్ మెంట్ పై ఉంది. లోకల్ గానే ట్రీట్మెంట్ అందేలా PHCల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి. ఎక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి వ్యాధి తగ్గిపోయే మందులు అందుబాటులో ఉంచితే చాలా వరకు రోగాల్ని అరికట్టవచ్చని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.