కంటి కలక కేసులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. ఈ అంటు వ్యాధి ఎక్కువగా హాస్టళ్లు, స్కూళ్లల్లో వస్తోంది. ఒకరి ద్వారా ఒకరికి సంక్రమించే ఈ వ్యాధి కోసం జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. కళ్లు ఎర్రగా మారే ఈ వ్యాధి… వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందంటున్నారు. కంజెంటైవా ఎడినో వైరల్(కంజెంటివైటిస్)గా పిలుచుకునే వ్యాధికి యాంటీ వైరల్ డ్రగ్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు అని చెబుతున్నారు.
చేతులు క్లీన్ గా ఉంచుకోవడం, డ్రాప్స్ వేసుకోవడం, నల్లద్దాలు పెట్టుకోవడం చేస్తే వ్యాధి తగ్గే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై మరీ అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ చెబుతోంది. ఇందుకోసం ఆశాలు, ANMలు అన్ని ప్రాంతాల్లో అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ నిర్విహించాలని ఆ శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.