Drinking Water Benefits : ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు బరువును కూడా తగ్గించుకోవచ్చు. తలనొప్పి, మూత్రపిండాల్లో రాళ్లను నివారించవచ్చు. పేగులను శుభ్రపరచడంలో నీళ్లు అద్భుతంగా సాయపడతాయి. జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఉదయం లేదా భోజనానికి ముందు 250 మిల్లీ లీటర్ల నుంచి 500 మిల్లీ లీటర్ల మధ్య నీళ్లను తాగాలి. గంటకు లీటరు కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే మూత్రపిండాలు ప్రాసెస్ చేయడానికి ఇబ్బందిగా మారుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.
మీ కడుపులో ఏమీ లేనప్పుడు నీరు త్రాగడం వల్ల శరీరం తన పనిని మరింత సమర్థవంతంగా పూర్తిచేస్తుంది. నీరు తాగడం ద్వారా శరీరంలో వ్యర్థాలను బయటకు విడుదల చేస్తుంది. మీ పేగుల్లో కదలికను కలిగిస్తూ మలబద్ధకం సమస్య నివారణకు పెద్దపేగును కూడా శుద్ధి చేస్తుంది. నీరు పెద్దపేగుకు మంచి టానిక్‌లా పనిచేస్తూనే ఉంటుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు నీరు తాగితే కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో నీరు తాగడానికి బెస్ట్ సమయం ఎప్పుడంటే? :
ఖాళీ కడుపుతో నీరు తాగడానికి మంచి సమయం ఉదయం మాత్రమే. భోజనానికి ముందు వ్యాయామానికి ముందు కూడా నీళ్లను తాగవచ్చు. రోజుకు 6 నుంచి 8 గంటలపాటు రాత్రి నిద్ర కూడా ఆరోగ్యానికి చాలామంచిది.
ఖాళీ కడుపుతో ఏ రకమైన నీరు త్రాగాలి? :
మీరు ఖాళీ కడుపుతో కొంచెం గోరువెచ్చని నీటిని తాగవచ్చు. ఇందులో పంపు నీరు, స్ప్రింగ్ వాటర్, మినరల్ వాటర్, రివర్స్ ఆస్మోసిస్ వాటర్, ఆర్టీసియన్ వాటర్, డిస్టిల్డ్ వాటర్, రివర్స్ ఆస్మోసిస్ వాటర్, బావి వాటర్, మిస్ట్ వాటర్, రెయిన్ వాటర్ అన్ని రకాల నీటిని తాగవచ్చు.
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం హానికరమా? :
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం హానికరం కాదు. అయితే యాసిడ్ రిఫ్లెక్ట్స్ వంటి కొన్ని నిర్దిష్ట ఆరోగ్య పరిస్థితులకు దారితీయొచ్చు. అధ్యయనం ప్రకారం.. ఒక నిమ్మకాయలో 31 గ్రాముల వరకు విటమిన్ ‘సి’ ఉంటుంది. శరీర రోజువారీ విటమిన్ ‘సి’లో 51 శాతం అందించగలదు. ఎడిసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లోని నిపుణులు ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీళ్లు తాగమని సిఫార్సు చేస్తున్నారు.
ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కలిగే కొన్ని ముఖ్య ప్రయోజనాలు ఇవే:
* శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.
* శరీరంలో శక్తి పెరుగుతుంది.
* మీ పేగులు శుభ్రపడతాయి.
* తొందరగా బరువు తగ్గుతారు.
* జీవక్రియ వేగవంతం అవుతుంది.
* జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
* మీ శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.
* కిడ్నీలో రాళ్లు రాకుండా ఉంటాయి.
* మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
* ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల తలనొప్పిని నివారించవచ్చు.