పండుగ సందర్భంగా పేలిన టపాసుల(Crackers)తో కంటి బాధితులు ఆసుపత్రికి క్యూ కట్టారు. హైదరాబాద్ సరోజినిదేవి ఐ హాస్పిటల్ కు 50 మందికి పైగా రాగా.. అక్కడి డాక్టర్లు వైద్యమందిస్తున్నారు. బాధితుల్లో చిన్న పిల్లలే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. తల్లిదండ్రులు పక్కన లేకుండా పేల్చిన టపాసులతో వాటిని కాల్చిన పిల్లలతోపాటు అటువైపుగా వెళ్తున్న వారిపై పడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి.
బాధితుల్లో పదేళ్ల లోపు చిన్నారులే ఎక్కువగా ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో క్రిటికల్ కేసులు లేకపోగా.. అడ్మిట్ అయిన 50 మందిలో సగం మంది రోడ్డుపై వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డవారే ఉన్నారు. సరోజినిదేవి హాస్పిటలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.