
తెలంగాణలో కొత్తగా మొదలుపెట్టబోతున్న మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. జిల్లాకో కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మరో ఎనిమిది మెడికల్ కళాశాలలకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వీటి పనులు ప్రారంభించేందుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద రూ.1,447 కోట్ల కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. గద్వాల, నర్సంపేట, యాదాద్రి కాలేజీలకు రూ.183 కోట్ల చొప్పున.. కుత్బుల్లాపూర్ కు రూ.182 కోట్లు.. నారాయణపేట, మెదక్, ములుగుకు రూ.180 కోట్ల చొప్పున.. మహేశ్వరం కాలేజీకి రూ.176 కోట్లు వెచ్చించనున్నట్లు ఆర్డర్స్ లో సర్కారు తెలియజేసింది.
భవనాల నిర్మాణాలకు గాను ఎస్టిమేషన్లు(Estimations) తయారు చేయాల్సిందిగా రోడ్లు, భవనాల(R&B) ఇంజినీర్-ఇన్-చీఫ్(ENC)కి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎనిమిది ప్రాంతాల్లో కాలేజీ బిల్డింగ్స్ తోపాటు హాస్టళ్ల నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పంచాల్సి ఉంటుంది.