
ఆరోగ్య రంగంలో మహిళా సాధికారత(Empowerment)కు గాను కేంద్ర ఆరోగ్యశాఖకు 3 గిన్నిస్ రికార్డులు దక్కాయి. స్వస్త్ నారి, సశక్త్ పరివార్ అభియాన్, వికసిత్ భారత్ కు రికార్డులు వచ్చాయి. నెలలో 3.21 కోట్ల మంది రిజిస్ట్రేషన్, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కు వారంలో 9.94 లక్షల మంది, రాష్ట్రస్థాయిలో ఆన్లైన్ స్క్రీనింగ్ కోసం వారంలో 1.25 లక్షల మంది రిజిస్టరవడం చరిత్ర సృష్టించింది. మహిళలు, కౌమార బాలికలు, చిన్నారుల్లో పౌష్టికాహారం పెంచేందుకు ‘పోషన్ మా’ స్కీంను మోదీ ప్రారంభించారు. 2025 సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని జిల్లాల్లో 19.7 లక్షల హెల్త్ క్యాంపులు చేపట్టి 11 కోట్ల మందిలో అవగాహన కల్పించారు. వీటిని గుర్తించిన గిన్నిస్ సంస్థ.. రికార్డుల్ని కట్టబెట్టింది.