ప్రజారోగ్యమే పరమాధిగా భావించాల్సిన ప్రస్తుత హైటెక్ యుగంలో నాసిరకపు వాసనలే కనపడుతున్నాయి. దేశ ఆరోగ్య రంగంలో 80 శాతం నాసిరకం సౌకర్యాలే ఉన్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వ స్వీయ మదింపు(Self Assessment) ద్వారా తేలింది. మానవ వనరులు(Manpower), సామగ్రి(Equipment), మౌలిక సదుపాయాల విషయంలో కనీస ప్రమాణాలు లేవని వెల్లడైంది.
విస్తుపోయేలా…
అధికారం చేపట్టిన 100 రోజుల్లో అమలు చేయాల్సిన పనుల గురించి ముందుగానే ప్లాన్ చేసుకున్న మోదీ సర్కారు… అన్ని శాఖల నుంచి రిపోర్ట్స్ సేకరించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వైద్యసౌకర్యాలపై ఎన్.హెచ్.ఎం(National Rural Health Mission) ఆధ్వర్యంలో స్వీయ మదింపు జరిగింది. డాక్టర్లు, నర్సులు లేరని, పరికరాల కొరత తీవ్రమై అవి కనీస స్థాయిలో కూడా లేవని తేలింది.
2 లక్షలకు…
NHM కింద జిల్లా, ఉప జిల్లాల ఆసుపత్రులు, CHC, PHC సెంటర్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఉండగా.. వాటిల్లో 2 లక్షల సదుపాయాలున్నాయి. ఇందులో 40,451 సౌకర్యాల్లో మాత్రమే అంతోఇంతో బాగున్నట్లు ఇండియన్ హెల్త్ పబ్లిక్ స్టాండర్డ్స్(IPHM)లో ఆరోగ్యశాఖ గుర్తించింది. 17,190 సెల్ఫ్ అసెస్మెంట్ శాంపిల్స్ లో 80% నాసిరకం సౌకర్యాలే. పరికరాలు, ఔషధాలు, పరీక్షలు పూర్తి అధ్వానం.
ఇక తనిఖీలే…
70 వేల సెంటర్లలో ఇబ్బందులున్నాయని గుర్తించిన కేంద్రం.. తొలి 100 రోజుల్లో వాటిని గాడినపెట్టాలన్న ఉద్దేశంతో ఈ అంతర్గత సర్వే చేపట్టింది. తొలుత సర్వే, ఆ తర్వాత ఆకస్మిక తనిఖీలు చేపట్టడం IPHC టార్గెట్. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్(NQAS) మేరకు మందులు, పరికరాలు, వేస్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్, ఇతర సేవల్ని పొందడం రోగుల హక్కు. వీటిని పక్కాగా అమలు చేసేందుకు 60% నిధుల్ని కేంద్రం, మిగిలిన 40% రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.