కార్డియో వాస్క్యులర్ డిసీజ్(CVDs) అంటే గుండెపోట్లు ప్రపంచానికి ఛాలెంజ్ గా మారాయి. ఏటా కోటీ 79 లక్షల మంది వ్యాధి బారిన పడుతుంటే అందులో 32 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పేద, మధ్యతరగతి దేశాల్లోనే ఇవి ఎక్కువగా ఉంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకటించింది. గుండెపోట్లలో 80 శాతం ఈ తరహా దేశాల్లోనే ఉంటున్నాయి. ఆర్థిక స్థోమత లేక, వైద్య ఖర్చులు పెరగడంతో ముందస్తు పరీక్షలు చేసుకునే అవకాశం లేకుండా పోతోంది. డయాబెటిస్, ఊబకాయం, ధూమపానం(Smoking) గుండె జబ్బుల బారిన పడేస్తున్నాయి. అవగాహన లేక, లైఫ్ స్టైల్ లో మార్పుల వల్ల CVDs పెరుగుతున్నాయని WHO తెలిపింది.
యువతలో గుండెజబ్బులు అధికంగా ఉంటున్నాయి. స్ట్రాంగ్ హెల్త్ కోసం ఎక్సర్ సైజ్, ఆహార అలవాట్లు, మానసిక పరిపక్వత, తగినంత నిద్ర ఉండాలని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. తినే ఫుడ్ లో ప్రతి పదేళ్లకోసారి మార్పులు వస్తుంటాయని దాన్ని బట్టే డైట్ ఉండాలంటున్నారు. ముందస్తుగా టెస్టులు చేయించుకోవాలన్న అవగాహన లేక చాలామంది పురుషులు, మహిళలు గుండెజబ్బుల బారిన పడుతున్నట్లు WHO రిపోర్టులో తెలిపింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొద్ది తలనొప్పి, భుజాల్లో నొప్పి, దవడ సమస్యలే 50 శాతం గుండెజబ్బులకు లక్షణాల(Symptoms)ని తేలింది.