Control High BP : మీకు హైబీపీ ఉందా? లేదంటే ఓసారి చెక్ చేసుకోండి. అధిక రక్తపోటును అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఇదో సైలంట్ కిల్లర్. ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టమే. ఒకవేళ వచ్చిందంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రక్తపోటు అకస్మాత్తుగా పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు సమయంలో రక్తం పంప్ చేయడానికి శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది. గుండె కండరాలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీని కారణంగా, శరీరంలో రక్త ప్రసరణ మందగించడం ప్రారంభమవుతుంది. శరీరంలో ఆక్సిజన్(Oxygen) కొరత ఏర్పడుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్న వారు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అధిక రక్తపోటు ఎందుకు ప్రాణాంతకం? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? పూర్తి వివరాలను తప్పక తెలుసుకోండి.
హైబీపీ ఎందుకు ప్రమాదకరమంటే? :
హైబీపీతో గుండెపోటు(Heart Attack) రిస్క్ ఉంటుంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) రిస్క్ పెరుగుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది ఇస్కీమిక్ స్ట్రోక్ కాగా.. రెండోది హెమరేజిక్ స్ట్రోక్. హైబీపీ ఉన్న వారిలో బీపీ ఒక్కసారిగా గణనీయంగా పెరుగుతుంది. తద్వారా బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తుంది. 30 శాతం మందికి అసలు తమకు బీపీ ఉందని కూడా తెలియదు.. ఎందుకంటే హైబీపీ లక్షణాలు చాలా సర్వసాధారణంగా ఉంటాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.
రక్తపోటు సాధారణ లక్షణాలు ఇవే :
శ్వాసలో ఇబ్బంది కలగడం
ఛాతీలో నొప్పిగా లేదా అసౌకర్యంగా ఉండటం
తీవ్రమైన తలనొప్పి
ఛాతీలో దడగా అనిపించడం
మోషన్ రావడంలో ఇబ్బంది
రక్తపోటును ఎలా నియంత్రించాలి? :
మీకు హైబీపీ ఉన్నట్టయితే.. ఎప్పటికప్పుడూ చెక్ చేసుకోండి.
ఆరోగ్యకరమైన జీవనశైలి(Life Style)ని అలవాటు చేసుకోండి.
ప్రతిరోజూ వ్యాయామం(Excercise) చేస్తుండాలి.
రోజూ 8 గంటలు నిద్ర(Sleeping)పోవాలి.
కూరగాయలు, రోజూ పండ్లు(Fruits) ఎక్కువగా తీసుకోవాలి.
మద్యం(Liquor) అతిగా సేవించరాదు
రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు(Water) తాగాలి
రోజూ అరగంట పాటు వ్యాయామం చేస్తుండాలి.
మీరు హైబీపీతో బాధపడుతున్నట్లయితే వెంటనే డాక్టర్లను సంప్రదించి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఉత్తమం. మీ జీవనశైలిలో మార్పులతో కూడా అధిక రక్తపోటు సమస్యలను అధిగమించవచ్చు.
Published 07 Feb 2024