రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ(Dengue) కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం 5,372 డెంగీ కేసులు రికార్డయ్యాయి. మొత్తం 81,932 శాంపిల్స్ తీసుకుంటే అందులో 6.5 శాతం మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక చికున్ గున్యా కేసులు హైదరాబాద్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాల్లో 152 బయటపడ్డాయి.
రాష్ట్ర రాజధానిలో అత్యధికంగా 1,852 కేసులు వెలుగుచూస్తే ఆ తర్వాత సూర్యాపేట(471), మేడ్చల్ మల్కాజిగిరి(426), ఖమ్మం(375), నల్గొండ(315), నిజామాబాద్(286), రంగారెడ్డి(232), జగిత్యాల(185), సంగారెడ్డి(160), వరంగల్(110) ఉన్నాయి.