దేశవ్యాప్తంగా టమాట రేటు చుక్కలు చూపిస్తోంది. ఎండాకాలం ప్రభావంతో పంటలు బాగా తగ్గడంతో మార్కెట్లోకి టమాట రవాణా తగ్గిపోయింది. దీంతో దీని ధర అమాంతం పెరిగింది. మన రాష్ట్రంలో కిలో టమాట రూ.100 వరకు పలుకుతుంటే.. ఉత్తర్ ప్రదేశ్ లో ఏకంగా రూ.162కు అమ్ముడైంది. షాజహాన్ పూర్ మార్కెట్లో కేజీ రేట్ రూ.162 ఉందని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో సైతం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మహా నగరాలతోపాటు అన్ని పట్టణాల్లోనూ టమాట ధర పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ లో రూ.100, దిల్లీలో రూ.120, చెన్నైలో రూ.117, ముంబయిలో రూ.108 పలికింది.