వైద్య కోసం 2025 తొలి 4 నెలల్లోనే భారతదేశానికి భారీగా విదేశీయులు(Foreigners) వచ్చారు. 171 దేశాల నుంచి 1,31,856 మంది రాగా.. మొత్తం టూరిస్టుల్లో ఇది 4.1%. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రాజ్యసభలో తెలిపారు. అగ్ర దేశాల కన్నా తక్కువ ధరలు, సక్సెస్ రేట్, ఈ-మెడికల్, ఈ-మెడికల్ అటెండెంట్ వీసాల సౌలభ్యత ఇక్కడుంది. బయాప్సీతో కూడిన కొలనోస్కోపికి US, UKలో 3,500 డాలర్లు(రూ.3 లక్షలు) ఉంటే, భారత్ లో అది రూ.3 వేలే. గుండె, కేన్సర్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్, IVF, ఆయుష్ లో వరల్డ్ క్లాస్ సర్జరీలు, వెయిటింగ్ లేని తీరుతో విదేశీయుల సంఖ్య భారీగా ఉంటోంది. అయితే మెడికల్ మాఫియాను అరికడితే.. ఈ సంఖ్య 10 రెట్లు పెరుగుతుందని చెప్పవచ్చు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com