పేదలకు తక్కువ ధరకు దొరికే జనరిక్ మందులపై మరోసారి వివాదం ఏర్పడింది. డాక్టర్లు కంపల్సరీగా జనరిక్ మందులే రాయాలంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC ఇచ్చిన ఆర్డర్స్ ను వెనక్కు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA కోరింది. జనరిక్ మెడిసిన్ రాయకపోతే డాక్టర్లకు ఫైన్ వేయడంతోపాటు లైసెన్స్ ను కొంతకాలం పాటు రద్దు చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇవ్వడంతో IMA అలర్ట్ అయింది. అన్ని మందులు ఇప్పటికిప్పుడు దొరకడం కష్టం అంటూ కేంద్ర వైద్యశాఖకు తెలిపింది. తయారైన మెడిసిన్ కు టెస్టులు చేపట్టే వ్యవస్థ కూడా లేదని గుర్తు చేసింది. NMC తీసుకున్న మరో కఠిన నిర్ణయాన్ని రిటర్న్ తీసుకోవాలని కోరింది. మందుల కంపెనీలు నిర్వహించే సమావేశాలు, సదస్సులకు డాక్టర్లు వెళ్లకూడదన్న NMC నిర్ణయాన్ని తప్పుబట్టి, దీనిపై పునరాలోచన చేయాలని కోరింది.
ఇవన్నీ ఇలా ఉంటే జనరిక్ మందులకు ఆదరణ పెరిగితే మెడికల్ మాఫియా అతలాకుతలం అవుతుంది. ఏటా వేలాది కోట్ల రూపాయల టర్నోవర్ కు అడ్డుకట్ట పడుతుంది. మరోవైపు డాక్టర్లు సైతం ఎవరికి వారే మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. తమ కంపెనీ మెడిసినే వాడాలంటూ వాటి రిప్రజంటేటివ్స్.. రెగ్యులర్ గా డాక్టర్లను కలవడంతోపాటు అప్పడప్పుడు మీటింగ్స్, సెమినార్స్ నిర్వహిస్తారు. వీటిని వ్యతిరేకిస్తున్న కొందరు గతంలోనే కేంద్ర వైద్యరోగ్య శాఖకు, NMCకి లెటర్లు రాశారు. బయట దొరికే ఔషధాల రేట్లలో కేవలం 20 నుంచి 40 శాతం మధ్యనే జనరిక్ మందులు దొరుకుతాయి. కానీ మెడికల్ మాఫియా వల్ల జనరిక్ మెడిసిన్ కు ఆదరణ దక్కడం లేదు. జనరిక్ మందులు పెద్దగా ప్రభావం చూపబోవని ఇప్పటికే ప్రచారం జరిగింది. అంటే వీటిని కొనకుండా ఉండేందుకు ఇలాంటి అసత్య ప్రచారం చేశారు. దీంతో జనరిక్ మందుల దుకాణాలు జనం లేక వెలవెలబోతున్నాయి.
ఇప్పుడు NMC తీసుకున్న నిర్ణయంతో మళ్లీ వీటికి ఆదరణ పెరుగుతుంది. కానీ జనరిక్ మందులను ఇప్పటికిప్పుడు వాడటానికి అంత పెద్దమొత్తంలో స్టాక్ లేదంటూ IMA.. కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయకు లెటర్ రాసింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనరిక్ మందులను విరివిగా వాడాలంటూ గతంలోనే ఆదేశాలిచ్చారు. కానీ అది పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం.. ఈ మెడిసిన్ వాడకంపై తీవ్రస్థాయిలో దృష్టిసారించింది. మరి IMA లెటర్ ఇచ్చిన దృష్ట్యా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Good news