ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) లెక్కల ప్రకారం జపాన్ వాసులు అత్యధిక ఆయుర్దాయంతో జీవిస్తున్నారు. ప్రశాంతత, ఒత్తిడి లేని, కాలుష్యం కానరాని విధానాలతో కాలం గడుపుతున్నారు. అక్కడ సగటు ఆయుష్షు 83.7 సంవత్సరాలైతే.. మహిళలు 86.8, పురుషులు 80.5 సంవత్సరాలు జీవిస్తున్నారు. ఆహార అలవాట్లు, వ్యాయామం(Exercise) వారిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
సీక్రెట్స్ ఇవే…
* తగిన మోతాదులో ఆహారం తీసుకోవడం.. కడుపులో 80 శాతం వరకే భోజన స్వీకరణ.. పెద్ద పళ్లెంలో కాకుండా చిన్న ప్లేట్లల్లో తినడం
* కుటుంబమంతా కలిసి భోజనం.. టీవీ, మొబైళ్లకు దూరంగా ఉంటూ కింద కూర్చుని తినడం
* ఒకేచోట కూర్చుని పనిచేయడానికి భిన్నంగా నడకను ఇష్టపడతారు. బస్, రైల్వే స్టేషన్లకు నడవడం, సైక్లింగ్ చేస్తుంటారు.
* టీ అంటే బాగా ఇష్టం. ‘మాచా టీ’ వెరీ ఫేమస్. అధిక పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో ఆ ఆకులు రోగనిరోధక శక్తి పెంచి, కేన్సర్ తో పోరాడే శక్తినిస్తాయి.
* బలమైన కుటుంబ, సామాజిక సంబంధాలు జపనీయుల్ని బలంగా ఉంచుతున్నాయి.
* రెగ్యులర్ గా వైద్య పరీక్షల చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించడం జపాన్ ప్రధాన లక్ష్యం.