‘ఏడాదిలో 300 రోజులు ఫూల్ మఖానా(Makhana) తింటా’ అంటూ ప్రధాని మోదీ చెప్పడంతో ఈ పదార్థంపై అంతటా ఆసక్తి ఏర్పడింది. పలు నగరాల్లో దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా తింటున్నారు. పాప్ కార్న్ లా కనిపించే మఖానా.. తామర మొక్క విత్తనం కాగా ఫాక్స్ నట్(Foxnut), లోటస్ సీడ్ అని కూడా పిలుస్తారు. దీన్ని పచ్చిగా లేదా వండి తినొచ్చు. ప్రొటీన్, ఫైబర్, కార్బొహైడ్రేట్స్ సహా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి మైక్రోన్యూట్రియంట్లు కలిగి ఉంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో అనుకూలం. రక్తంలో చక్కెర స్థాయిల్ని మఖానా నియంత్రిస్తుందని తేలింది.
అందరికీ ఆరోగ్యకరమే…
ప్రొటీన్, ఫైబర్ వల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా చేస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడం, బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేయడంలో పొటాషియం చూసుకుంటుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి శరీరంలోని హానికరమైన ఫ్రీరాడికల్స్ తొలగిస్తాయి. బిహార్లో పుట్టిన మఖానాతో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. చెరువులు, బురదనీటి గుంటల్లోని తామర పూల నుంచే వస్తుంటాయివి. అయితే అన్ని రకాల తామర పూల నుంచి కాదు. యూరియల్ ఫారెక్స్, ప్రిక్లీ అనే వాటర్ లిల్లీ నుంచి మాత్రమే వస్తుంటుంది.