
ర్యాగింగ్ నేరమని తెలిసినా మెడిసిన్(Medicine) చదువుతున్న విద్యార్థుల్లో భయం కనిపించడం లేదు. తమ కెరీర్ కే ఫుల్ స్టాప్ పడుతుందన్న విషయాన్ని మరచి పదే పదే అదే తీరుకు పాల్పడుతూ క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా చేస్తున్నారు. మరోవైపు ర్యాగింగ్ ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్న కోణంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం కఠిన చర్యల(Serious Action)కు దిగుతున్నది. అతి పెద్ద మెడికల్ కాలేజీగా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ గాంధీ క్యాంపస్ లోనూ స్టూడెంట్స్ ర్యాగింగ్ కు పాల్పడ్డట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. పిచ్చి పిచ్చి పనులకు పాల్పడ్డ 10 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏడాది కాలం పాటు వేటుపడ్డ వారంతా మెడికల్ విద్య చదవకుండా దూరంగా ఉంచుతూ DME(Director Of Medical Education) రమేశ్ రెడ్డి ఆర్డర్స్ రిలీజ్ చేశారు.
జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్న సీనియర్లపై చర్యలు తీసుకుంటున్నట్లు DME ప్రకటించారు. తమపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ జూనియర్ మెడికోలు ఇచ్చిన కంప్లయింట్ మేరకు పూర్తిస్థాయిలో కాలేజీ అధికారులతో ఎంక్వయిరీ చేయించారు. జరిగింది నిజమేనని నిర్ధారించి విద్యార్థులపై వేటు వేశారు.