ఆఫ్రికా ఖండాన్ని మంకీపాక్స్(Monkeypox) కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటిదాకా 22,863 కేసులు వెలుగుచూస్తే అందులో 622 మంది మృత్యువాత(Deaths) పడ్డారు. కాంగో దేశంలోనే 4 వేల మంది వ్యాధి బారినపడి 81 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వారంలో వ్యాక్సిన్(Vaccine) వస్తుందని అక్కడి ఆరోగ్య శాఖలు ప్రకటిస్తున్నాయి.
మంకీపాక్స్ బాధిత దేశాలకు 3,80,000 ఎంపాక్స్ డోసులు పంపిస్తామని ఇప్పటికే యూరోపియన్ యూనియన్, అమెరికా హామీ ఇచ్చాయి. అవి ఎప్పుడొస్తాయా అని ఆఫ్రికా దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఇది ఇతర ఖండాలకు కూడా విస్తరించడంతో చాలా దేశాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. పాకిస్థాన్ సహా మన చుట్టుపక్కల దేశాల్లోనూ కేసులు బయటపడటంతో అన్ని ఎయిర్ పోర్టులు, ఓడరేవుల్లో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది.